
నిజాంసాగర్(జుక్కల్): భార్యపై అనుమానంతో బీరయ్య(30)అనే భర్త బుధవారం తెల్లవారుజామున పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై హైమద్‌తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.నిజాంసాగర్ మండలం గున్కుర్ గ్రామానికి చెందిన స్వప్నకు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండం మీర్‌ఖాన్ పేట గ్రామానికి చెందిన బీరయ్యతో పన్నెండేళ్ల క్రితం పెళ్లయిందన్నారు.
వీరికిముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. భార్యభర్తల మధ్య తరచూగొడవలు జరగడంతో పలుమార్లు పంచాయతీ నిర్వహించారన్నారు. అత్తగారి ఇంటి వద్ద ఉన్న భార్యను కాపురానికితీసుకెళ్లేందుకు మంగళవారం గున్కుల్ గ్రామానికి బీరయ్య వచ్చాడు. భార్యపై అనుమానం పెట్టుకున్న బీరయ్య అత్తగారిఇంట్లోనే పురుగుల మందు తాగడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈమేరకు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment