సాక్షి, మునుగోడు(నల్గొండ) : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ఉసురు తీసింది. అప్పులబాధతో ఆత్మహత్య చేసున్నాడని చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తిచేయించింది. మృతుడి కుమారుడి ద్వారా 18 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురుపాటి అనిల్(32) రోజు వారి కూలీ. ఇతనికి పదేళ్ల క్రితం అరుణతో వివాహమైయింది. వారికి ముగ్గురు కుమారులు. భార్య అరుణ అదే గ్రామానికి చెందిన అడెపు రాంబాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నెల 8వ తేదీన అనిల్ కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చే సమయానికి అరుణ రాంబాబుతో ఇంట్లో ఉండడాన్ని చూశాడు. ఆమెతో ఘర్షణపడి భోజనం చేసి నిద్రపోయాడు. చదవండి: ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు
ప్రియుడిని పిలిపించుకుని..
భర్త తనని తిట్టడంతో పాటు కొట్టాడని, అతడిని చంపేద్దామని అరుణ రాత్రి 12 గంటల సమయంలో రాంబాబును ఇంటికి పిలిపించుకుంది. అప్పటికే గాడ నిద్రలో ఉన్న అనిల్ మొహంపై రాంబాబు దుప్పిటి అదిమి పట్టడంతో పాటు చేతులు కదలకుండా పట్టుకున్నాడు. అరుణ అనిల్ మర్మాంగాలను వత్తి పగలగొట్టి హత్య చేశారు. తిరిగి ఏమీ తెలియనట్టు రాంబాబు తన ఇంటికి వెళ్లిపోగా అరుణ మృతదేహం పక్కనే పెట్టుకొని ఆ రాత్రి నిద్రపొయి పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకుంటోంది. తండ్రి లేవడం లేదని చిన్న కుమారుడు తాత, నాన్నమ్మలకు చెప్పాడు. వారు వెళ్లి చూసి చనిపోయాడని నిర్ధారించారు. అరుణ తనకు ఏమీ తెలియనట్టు అందరితో కలసి ఏడ్చి.. అప్పులబాధతో మత్తు మాత్రలు వేసుకుని చనిపోయాడని.. నమ్మించింది. అదేరోజు అంత్యక్రియలు పూర్తిచేయించింది. చదవండి: రూ. 22 వేల కోట్ల స్కాం : ఓంకార్ గ్రూప్ చైర్మన్ అరెస్ట్
వెలుగులోకి వచ్చింది ఇలా..
తండ్రిని తల్లి చంపిన ఘటనను వీరి పెద్ద కుమారుడు రాఘవేంద్ర చూశాడు. ఆ విషయాన్ని అప్పుడే కుటుంబ సభ్యులకు చెబుతానని తల్లితో అన్నాడు. చెప్తే మీ నాన్న లాగానే నిన్ను కూడా చంపేస్తానని బెదిరించింది. అప్పటినుంచి తన కొడుకు ఎవరి వద్దకూ వెళ్లకుండా జాగ్రత్త పడింది. అయితే ఈ నెల 25న అరుణ పని నిమిత్తం మునుగోడుకు వెళ్లింది. ఆ సమయంలో రాఘవేంద్ర తాత, నానమ్మ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో లబోదిబోమంటూ వారు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. అంతా కలసి మంగళవారం పోలీసులకు విషయాన్ని చెప్పాడు. పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని విచారించగా తను, రాంబాబు కలసి చంపామని ఒప్పుకుంది. రాంబాబు పరారీలో ఉన్నాడు. అనిల్ తండ్రి కురుపాటి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజినీకర్ తెలిపారు.
జంట హత్యల మృతుల గుర్తింపు
నల్లగొండ క్రైం : జిల్లా కేంద్ర సమీపంలోని మిర్యాలగూడ రోడ్డులో రాంనగర్‌వద్ద జరిగిన జంట హత్యల మృతులను మంగళవారం టూటౌన్ పోలీసులు గుర్తించారు. చేతి ఉంగరం ఆధారంగా మృతులు ఈస్ట్ గోదావరి జిల్లాలోని పత్తిపాడు మండలంలోని పోతులూరి గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావు అలియాస్ శశిదర్(30), రామ్‌జీ బాబాగా పోలీసులు గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత హత్య జరిగినట్లుగా నిర్ధారించిన పోలీసులు నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై ఉన్న సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. రాత్రి 11 గంటలకు మృతుల కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హత్యకు గురైన అనిల్
Comments
Please login to add a commentAdd a comment