![Woman Committed Self Assassination Not Bear Cheated By Nephew - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/24/crime_0.jpg.webp?itok=1HlHyTf_)
సాక్షి, నవీపేట(బోధన్): ప్రేమించిన మేనబావ మోసం చేసిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని మండల కేంద్రానికి చెందిన యువతి మంగళవారం రాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్‌కు చెందిన మేనబావ ప్రేమ్‌ను నాలుగేళ్లుగా ప్రేమించానని, పెళ్లికి నిరాకరించడంతో న్యాయం చేయాలని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారు స్పందించక పోవడంతో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగడంతో సిబ్బంది గుర్తించి చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మేనబావ మోసం చేశాడని ఫిర్యాదు రావడంతో పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పడంతో సమయం ఇచ్చినట్లు తెలిపారు. ఆలోగా ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో ప్రేమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చందర్, లోకేష్, పప్పిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బోధన్‌లో...
మండలంలోని స్షేషన్ ఏరియాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని బుధవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పక్కింటి వాళ్లు గమనించి కాపాడారని పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment