ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై(అన్నానగర్): సేలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తని హత్య చేసిన కేసులో భార్యకి కోర్టు మంగళవారం యావజ్జీవ శిక్ష విధించింది. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని గుంజాండి ఊరుకు చెందిన సెల్వరాజ్ (31) ఫైనాన్షియర్. భార్య వనిత (30). వీరికి కుమారుడు ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వనితకి వివాహేతర సంబంధం ఏర్పడింది. సెల్వరాజ్ హెచ్చరించినా వనిత వివాహేతరసంబంధాన్ని వదలలేదు.
2011 సెప్టెంబర్ 5న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి సెల్వరాజ్ నిద్రపోతున్న సమయంలో వనిత అతని గొంతు నులిమి చంపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలులో ఉంచారు. మంగళవారం మేట్టూరు అదనపు జిల్లా కోర్టు ఈ కేసును విచారించింది. హత్య చేయడం నిరూపితం కావడంతో వనితకు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కుమార శరవణన్ తీర్పు వెలువరించారు.
చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్)
Comments
Please login to add a commentAdd a comment