
హతురాలు ఉషా (ఫైల్)
సాక్షి, కృష్ణరాజపురం: తనకు దక్కలేదని కసితో యువతిని చంపి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం బెంగళూరు కేఆర్ పురం వద్ద అనుగొండనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఉషా(25), గోపాలకృష్ణ అనేవారు మృతులు. బుధవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
తనను పెళ్లి చేసుకోవాలని ఉషాను యువకుడు వేధించేవాడు. ఉషా ఇందుకు నిరాకరించేది. మాట్లాడాలని చెప్పి చెరువు వద్దకు పిలిపించిన దుండగుడు ఆమెను గొంతు నులిమి చంపి, తరువాత తాను పురుగుల మందు తాగి చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment