కాకినాడ సిటీ: నాయకుడంటే నమ్మకం.. నాయకుడంటే భరోసా.. నాయకుడంటే మనసున్న మనిషి.. ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన నిజమైన సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఊపిరి సలపని క్షణాల్లోనూ ముఖంపై చెక్కు చెదరని చిరునవ్వు ఆయన సొంతం. ఎలాంటి పరిస్థితి అయినా కష్టం వింటే చలించి.. నేనున్నానంటూ చేయూతనివ్వడం ఆయన నైజం. అందుకే నిరుపేదలు ఆయనను తమను బాధల నుంచి గట్టెక్కించే దైవంగా విశ్వసిస్తున్నారు. ఆ భావనతో కొందరు సీఎం వైఎస్ జగన్‌ను సామర్లకోటలో కలిసి, తమ కష్టాలను వివరించారు.
గురువారం జగనన్న కాలనీల్లో సామూహిక గృహ ప్రవేశాలకు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను హెలిప్యాడ్ వద్ద కలుసుకున్నారు. తమ ఇంట్లో అనారోగ్య బాధితుల గురించి చెప్పి గోడు వెళ్లబోసుకున్నారు. అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ ఆయన అన్నీ మరచి.. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి అనారోగ్య సమస్యలపై తక్షణమే స్పందించాలని కాకినాడ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఫలితంగా కలెక్టర్ కృతికా శుక్లా నేతృత్వంలో అధికారులు 24 గంటల్లోనే తక్షణ ఆర్థిక సాయం అందేలా పని చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 17 మందిని తన కార్యాలయానికి కలెక్టర్ పిలిచారు.
సీఎం సహాయ నిధి నుంచి శుక్రవారం సాయంత్రం రూ.లక్ష చొప్పున వారికి ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. వినతి ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఇలా స్పందించి ఆదుకుంటారని భావించలేదంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
► పెద్దాపురానికి చెందిన అయినాల మాధవరావు కుమారుడు సాయి వెంకట్ (11) అనారోగ్య బాధితుడు. ఈ బాబుకు వైద్య సహాయంగా కలెక్టర్ చెక్కు అందించారు.
► కోనసీమ జిల్లాకు చెందిన పి.విజయచక్రవర్తి కుమార్తె మాధురి నవ్య (13) అనారోగ్య పీడితురాలు. ఈమె కష్టాన్ని చూసి సీఎం స్పందించారు. ఆమెకు ఆర్థిక సాయం చేశారు.
► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జె.వీరయ్య కుమారుడు వీర వెంకట సాయి (16) లుకేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. అతడి వైద్యానికి ఆర్థిక సాయం అందజేశారు.
► కోనసీమ జిల్లాకు చెందిన సీహెచ్ దుర్గాభవాని కుమార్తె హర్షిత (15) థ్రాంబోకైటోపినియాతో బాధ పడుతోంది. ఆమెకు ఆర్థిక సాయం అందించారు.
► కోనసీమ జిల్లాకే చెందిన జి.సుజాత (43) మీనింగోమా వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు వైద్యం నిమిత్తం కలెక్టర్ ఆర్థిక సాయం అందజేశారు.
► ఇదే జిల్లాకు చెందిన ఎన్.సతీష్ (31) విద్యుత్ షాక్‌తో వికలాంగుడయ్యాడు. అతడికి ఆర్థిక సాయం అందజేశారు.
► కోనసీమకు చెందిన పి.ప్రేమ్‌చంద్ (22) తీవ్ర అనారోగ్య బాధితుడు. ఈ యువకునికి ఆర్థిక సహాయం అందించారు.
►పెద్దాపురానికి చెందిన బుర్రా వెంకటస్వామి కుమారుడు రాజు (47) అనారోగ్యంతో కదల్లేని దుస్థితి. ఇతనికి ఆర్థిక సాయం అందజేశారు.
►పెద్దాపురానికి చెందిన పాలికల వీరభద్రుడు కుమారుడు సత్య సుబ్రహ్మణ్యానికి రెండేళ్లు. ఈ బాలుడు కిడ్నీ సంబంధ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆరోగ్యశ్రీ, ఆర్థిక సాయాన్ని కలెక్టర్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment