గడువులోగా అర్జీల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అర్జీల పరిష్కారం

Published Tue, Jan 28 2025 2:09 AM | Last Updated on Tue, Jan 28 2025 2:09 AM

గడువులోగా అర్జీల పరిష్కారం

గడువులోగా అర్జీల పరిష్కారం

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో అందే ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల సమస్యలను విని అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి డీఆర్‌ఓ రాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ ఎ.శివశంకర్‌ ప్రసాద్‌, డ్వామా పీడీ మధుసూదన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఎస్‌.త్రినాథరావు కృష్ణమూర్తి 212 అర్జీలు స్వీకరించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల సమన్వయంతో జియో కోఆర్డినేటర్లతో మ్యాపులను రూపొందించాలని ఆదేశించారు.

రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, విద్యాసంస్థలు, వాటర్‌ ట్యాంకులు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు, సైక్లోన్‌ పునరావాస కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, విద్యుత్‌ లైన్లు, ట్రాన్ప్‌ఫార్మర్లు సబ్‌ స్టేషన్లు తదితర అంశాలపై మ్యాపులను చిత్రీకరించాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం అంతర్వేది లక్ష్మినరసింహస్వామి వారి ఆలయం వద్ద స్వామివారి తిరుకల్యాణోత్సవాలకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు, వికాస జిల్లా మేనేజర్‌ జి. రమేష్‌ పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 34 అర్జీలు

అమలాపురం టౌన్‌: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 34 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఎస్పీ అక్కడ నుంచే ఫోన్లలో మాట్లాడి పరిష్కార మార్గాలపై ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి సమస్యపై తీసుకున్న పరిష్కార చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎస్పీ బాధితులతో చర్చించి పరిష్కార మార్గాలపై మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement