నిషేధించిన చైనాకు చెందిన మాంజా దారం
గాలిపటాల తయారీలో జాగ్రత్త అవసరం
పిఠాపురం: సంక్రాంతి వస్తుందంటే చాలు ఆకాశంలో రంగు రంగుల పతంగులు ఎగురుతుంటాయి. పిల్లలు కాగితాలతో తయారు చేసిన గాలి పటాలను ఎగురవేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటి వరకూ గాలిపటాలకు నూలు దారం వాడే వారు. కానీ మార్కెట్‌లోకి చైనాకు సంబంధించి మాంజా దారం అందుబాటులోకి రావడంతో దానినే వినియోగిస్తున్నారు. కాటన్ దారం తెగిపోతుందని, మాంజా దారం తెగకుండా ఉంటుందని మక్కువ చూపుతున్నారు. ఈ మాంజా (గాజు ముక్కలు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన) తాడును వాడొద్దని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీని వాడడంతో ప్రాణాల మీదకు వస్తుండడం, పక్షులకు హాని కలుగుతుండడం, పిల్లలు గాయాల పాలవుతుండడంతో నిషేధించారు. వీటి వాడకం ప్రమాదకరమని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment