చివరి దశలో నాట్లు | - | Sakshi
Sakshi News home page

చివరి దశలో నాట్లు

Published Fri, Jan 31 2025 2:20 AM | Last Updated on Fri, Jan 31 2025 2:20 AM

చివరి

చివరి దశలో నాట్లు

అందుబాటులో ఎరువులు

రబీ సాగుకు అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సొసైటీలతో పాటు రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద వీటిని సిద్ధంగా ఉంచారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 10,317 మెట్రిక్‌ టన్నులు, కొవ్వూరు డివిజన్‌లో 11,188 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. దీనిలో డీఏపీ 1,168 మెట్రిక్‌ టన్నులు, ఎఫ్‌ఓఎం 1,168 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 2,340 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌పీకేఎస్‌ ఎరువు 7,461 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1827 మెట్రిక్‌ టన్నులు, యూరియా 7,539 మెట్రిక్‌ టన్నుల చొప్పున సిద్ధం చేశారు.

53,312 హెక్టార్లలో పూర్తి

జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 60,042 హెక్టార్లు

దిగుబడిపై రైతుల ఆశలు

దేవరపల్లి: జిల్లాలో దాళ్వా వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మెట్ట ప్రాంతంలోని బోర్ల కింద నాట్లు ముందుగా వేయగా, కాలువల కింద కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సకాలంలో పూర్తి చేశారు. గత ఖరీఫ్‌లో దిగుబడులు అంతంత మాత్రంగా రావడం, నాట్లు వేసిన అనంతరం భారీ వర్షాలు, వరుస తుపాన్ల కారణంగా రైతులు కొంత వరకూ నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వేసిన రబీ వరి నాట్లు ఆరోగ్యకరంగా, ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. రబీలో రైతులు సాధారణంగా ఎకరాకు 50 నుంచి 55 బస్తాల దిగుబడులు సాధిస్తున్నారు. పెట్టుబడులు పోనూ ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ నికర ఆదాయం వస్తోందని చెబుతున్నారు. అదే ఖరీఫ్‌లో అయితే పంట చేతికి వచ్చే వరకూ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.

అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 60,042 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ 53,312 హెక్టార్లలో రైతులు వరి నాట్లు వేశారు. నీటి సదుపాయం లేని భూముల్లో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న, అపరాలు సాగు చేస్తున్నారు.

మొక్కజొన్న 6,269 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దిగుబడులతో పాటు ధర కూడా బాగుండటంతో ఎక్కువ మంది మొక్కజొన్న సాగుపై కూడా మొగ్గు చూపుతున్నారు.

39,500 ఎకరాల్లో సేంద్రియ సాగు

జిల్లాలో 38,020 మంది రైతులు, 39,500 ఎకరాల్లో దాళ్వాలో సేంద్రియ వరి సాగు చేస్తున్నారు. ఈ చేలకు డ్రోన్‌ ద్వారా పురుగులు, తెగుళ్ల నివారణకు, బలానికి ఒకేసారి డ్రోన్‌ ద్వారా కషాయాలు పిచికారీ చేస్తున్నాం. ఎకరాకు సాధారణంగా రూ.1,000 ఖర్చవుతుంది, కానీ ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా రూ.600కే పిచికారీ చేస్తున్నాం. ఎకరం చేనుకు 10 నిమిషాల్లో పిచికారీ జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతున్నాయి. ఖరీఫ్‌లో 3,400 మంది రైతులు, 3,600 ఎకరాల్లో సేంద్రియ సాగు చేసి, మంచి దిగుబడులు సాధించారు.

– బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌, ప్రకృతి వ్యవసాయ విభాగం, రాజమహేంద్రవరం

ఎరువుల కొరత లేదు

రబీలో ఎక్కడా ఎరువుల కొరత లేదు. ప్రధానంగా యూరియా 7,539 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. దాళ్వా వరి నాట్లు 89 శాతం పూర్తయ్యాయి. అక్కడక్కడ నాట్లు పడుతున్నాయి. జిల్లాలో 65,801 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసిన వరి చేలు ఆరోగ్యంగా ఉన్నాయి.

– ఎస్‌.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి,

రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment
చివరి దశలో నాట్లు1
1/2

చివరి దశలో నాట్లు

చివరి దశలో నాట్లు2
2/2

చివరి దశలో నాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement