మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలు

Published Fri, Jan 31 2025 2:20 AM | Last Updated on Fri, Jan 31 2025 2:20 AM

మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలు

మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలు

రాజానగరం: మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే విధంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఈ పథకం ద్వారా ఉచితంగా మంజూరు చేసిన చేప పిల్లలను (సీడ్స్‌) మండలంలోని నందరాడ అడుసుమిల్లి వెంకయ్య చెరువు(ఏవీ ట్యాంకు)లో గురువారం ఆమె వదిలారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చేపల ఉత్పత్తిని పెంచే దిశగా జిల్లాలోని 46 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల్లో 3.23 లక్షల చేప పిల్లలను మత్స్యకార సంఘాలకు ఉచితంగా అందించామన్నారు. దీనిద్వారా 32 మత్స్యకార సంఘాల్లోని 5,300 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. చేప పిల్లలను బయట కొనుగోలు చేస్తే ఆయా సంఘాలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వమే వాటిని ఉచితంగా అందిస్తోందని చెప్పారు. చెరువుల్లో వేసిన చేప పిల్లలు మూడు నాలుగు నెలల్లో పెరుగుతాయని, అనంతరం పట్టుకుని విక్రయించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పథకం మార్గదర్శకాల మేరకు ఆక్వా జోన్‌లో ఉన్న చేపల చెరువులకు సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే చెరువు తవ్వి నాన్‌ ఆక్వా జోన్‌లో ఉన్న వారికి కూడా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి వి.కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బలసాడి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement