కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 35 మందిపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ డీఎస్‌పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులతో ఈ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 35 మందికి మూడో ఏజేఎఫ్ మెజిస్ట్రేట్ సి.రమ్య శిక్ష విధించారు. 34 మందికి రూ.10 వేల చొప్పున రూ.3.40 లక్షల జరిమానా, మరొకరికి ఒక రోజు జైలు శిక్ష విధించారని డీఎస్‌పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment