![ఉచిత సిలిండర్లకు అదనపు వసూళ్లను సహించం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rjc235-270086_mr-1738867030-0.jpg.webp?itok=0CtO-OPG)
ఉచిత సిలిండర్లకు అదనపు వసూళ్లను సహించం
రాజమహేంద్రవరం సిటీ: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు అనధికార వసూళ్లు చేస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు హెచ్చరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌వో) కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపం–2 లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పథకం కింద చెల్లించాల్సిన అసలు బిల్లు కన్నా కొన్ని గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్‌లు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలా అధికంగా వసూలు చేయరాదని, ప్రతి నెలా గ్యాస్ డెలివరీ బాయ్‌లకు రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. తరచుగా తప్పు చేసే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత సిలిండర్లకు ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే జిల్లా పౌరసరఫరాల అధికారికి 80083 01429 మొబైల్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని జేసీ చిన్నరాముడు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి పౌర సరఫరాల అధికారి ఎం.నాగాంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ డివిజన్‌లో నూజివీడు – వట్లూరు – ఏలూరు మధ్య జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా శనివారం పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. విజయవాడ – రాజమహేంద్రవరం (67262), రాజమహేంద్రవరం – విజయవాడ (67261), విజయవాడ – రాజమహేంద్రవరం (67202), రాజమహేంద్రవరం – విజయవాడ (67201), కాకినాడ పోర్ట్ – విజయవాడ (17258), విజయవాడ – కాకినాడ (17257) రైళ్లను రద్దు చేశామని వివరించారు. మరో 13 రైళ్లను శుక్ర, శనివారాల్లో గుడివాడ మీదుగా మళ్లించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment