మఠంగూడెంలో దారుణహత్య
● కొడవలితో భార్యను హత్య చేసిన భర్త
● నిందితుడు పరారీ
● హత్యకు దారితీసిన అనుమానం
లింగపాలెం: రక్తపు మడుగులో ఓ మహిళ మృతి చెందడం లింగపాలెం మండలం మఠంగూడెంలో సంచలనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన జక్కంపూడి నాగమణి (45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రతిరోజూ పనులకు వెళ్లే విధంగానే తోటి కూలీలు ఆమెను పనికి రమ్మని పిలవడానికి వెళ్లగా.. ఇంట్లో రక్తపు మడుగుల్లో నాగమణి పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చింతలపూడి సీఐ ఎం.రవీంద్ర, ధర్మాజీగూడెం ఎస్సై కే వెంకన్న హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో వివరాలు సేకరిస్తున్నారు.
అనుమానమే.. పెనుభూతమై
జక్కంపూడి మారేష్, నాగమణి భార్యభర్తలు. వీరికి ఒక కుమారుడు కుమార్తె సంతానం కాగా వారిద్దరికి వివాహాలై వేరే చోట నివసిస్తున్నారు. కాగా మారేష్ మద్యానికి బానిస కావడంతో నాగమణిని ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో గొడవలను సర్దుబాటు చేశారు. అయితే మారేష్ ఇటీవల మద్యం సేవించి మతిస్థిమితం లేనివాడిలా ప్రవర్తించేవాడిని స్థానికులు చెబుతున్నారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి భార్య నాగమణిని కత్తితో నరికి చంపివేసి పరారీ అయ్యాడు. చింతలపూడి సీఐ రవీంద్ర పర్యవేక్షణలో ధర్మాజీగూడెం ఎస్సై కే. వెంకన్న ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment