గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ

Published Fri, Jan 31 2025 1:07 AM | Last Updated on Fri, Jan 31 2025 1:07 AM

గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ

గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ

ఏలూరు (మెట్రో): గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ గౌతమీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శ ఐటీడీఏగా కేఆర్‌పురం ఐటీడీఏను నిలిపే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో సమష్టి కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలో విద్యుత్‌ సౌకర్యం లేని ఏఒక్క గిరిజన గ్రామం ఉండకూడదన్నారు. గిరిజన ప్రాంతంలో రోడ్డు కనెక్టవిటి, టెలిఫోన్‌ కనెక్టవిటీ, అంతర్గత రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి పర్చాలన్నారు. సమావేశంలో పీసా గ్రామ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. అలాగే గిరిజన ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. మాతా శిశు మరణాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులకు సురక్షిత ప్రసవాలు జరిగేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇందుకోసం ముందస్తుగా వారిని గుర్తించి సంబంధిత యాప్‌లో నమోదు చేయాలన్నారు. శిశువులకు నూరుశాతం వ్యాక్సినేషన్‌ నిర్వహించాలన్నారు. మలేరియా, డెంగీ, ఫైలేరియా, చికెన్‌ ఫాక్స్‌, వంటి వ్యాధుల నిర్మూలనపై చేపట్టిన చర్యలపై సమీక్షించారు. అలాగే గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలతో పాటు ఇళ్లకు సంబంధించిన ప్రగతిని చూపించి త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వీటీజీఎస్‌ ద్వారా అడ్డాకుల తయారీ, వేరుశెనగ, జీడిపప్పు, చాక్‌లెట్‌ తయారీ తదితర అంశాలపై ప్రోత్సహించాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్‌, ఏపీవో పీవీఎస్‌ నాయుడు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ లత, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎస్డీసీ ఐ.కిషోర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ కె.శ్రీను, ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.సురేష్‌, ఐసీడీఎస్‌, హౌసింగ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement