
ఈదురుగాలులతో వర్షం
పోలవరం రూరల్: పోలవరం మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురింది. దీంతో పట్టిసం – జీలుగుమిల్లి జాతీయ రహదారిలో వెంకటాపురం, ఎల్‌ఎన్‌డీపేట గ్రామాల మధ్య చెట్లు కూలిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఆర్‌ఎస్‌రాజు రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
తప్పిన ప్రమాదం
కామవరపుకోట: స్థానిక కొత్తూరు కాలనీలో ఆదివారం సాయంకాలం ఈదురుగాలులకు ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి పడిపోయింది. స్తంభం కింద పడే సమయంలో పక్కనే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై విద్యుత్ అధికారులను వివరణ కోరగా విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: స్థానిక జాతీయ రహదారిలో హ్యుందాయ్ షోరూం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేటకు చెందిన తోట లక్ష్మీనారాయణ (42) పిల్లల చదువుల కోసం ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నాడు. లక్ష్మీనారాయణ మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. జంగారెడ్డిగూడెం ఎస్సై షేక్ జబీర్‌కు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని చేధించేందుకు రహదారిపై ఉన్న సీసీ కెమెరాను పోలీసులు పరిశీలిస్తున్నారు. లక్ష్మీనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈదురుగాలులతో వర్షం