వాటిపై మోజు,ముప్పై దాటినా పెళ్లి ముచ్చట లేదు...కారణమిదే! | Are Youngsters Giving Up On Marriage How Is Family System Now | Sakshi
Sakshi News home page

వాటిపై మోజు,ముప్పై దాటినా పెళ్లి ముచ్చట లేదు...కారణమిదే!

Published Sat, Jun 17 2023 10:22 AM | Last Updated on Sat, Jun 17 2023 12:50 PM

Are Youngsters Giving Up On Marriage How Is Family System Now - Sakshi

కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు.. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ  కూలి పోతుంది అనే అభిప్రాయం ఈమధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా  ఏదో తూ..తూ...మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుషులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతోంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు!అసలు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి  కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
 

  • అతి తెలివి 
  •  చిన్న తప్పును కూడా భరించే శక్తి,సహనం లేవు.
  •  అందరూ సమానమే అనే వింత భావన పెరగటం (డెమాక్రసి).
  •  పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకోక పోవడం.
  • ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం.  
  • ఎక్కడో ఉన్న సినిమా నటులు,  ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు.కానీ, ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.
  •  చిన్న చిన్నదానికీ అలిగి, దగ్గరి వారికి కూడా దూరం అవుతున్నారు. 
  •  ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది .
  •  ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.
  •  ఇంట్లో భార్యా భర్తలు (తల్లిదండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసుకుంటున్నారు.అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు.  "ముఫై దాటినా"  పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత ముఫై నలభై ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు. 
  • ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం, తదితర కారణాలు అధికమయ్యాయి .
  •  మనుషులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ విలాస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెగింపుతనం వచ్చింది. 
  •  మధ్యవర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవరిష్టం వారిదే అయ్యింది.
  •  కుటుంబ నిర్వహణ ఒక కళ. అది అందరికీ లేకపోవడం వల్ల వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది. 
  •  మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను, నా భార్య/భర్త, అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది.పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. 
  • ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు ఇక ఉండవు.  ఎవరిష్టం వాళ్లదే అయ్యే రోజులు వచ్చేశాయి.
  • అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, భార్యా భర్తల మధ్య  బలమైన బంధాలు ఇప్పుడు లేవు. 
  • సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. 
  • ప్రస్తుతం నడుస్తుందంతా  ఒక షో.. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది.
  •  డిజిటల్ ప్లాట్‌ఫాంపై  ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం.
  •  మెరుగైన ప్యాకేజీలు, విలాస జీవితాలపై మోజు పెంచుకుంటున్న యువతులు సాధారణ ఉద్యోగులను పెళ్లి చేసుకునే పరిస్థితి రావడం లేదు. 30 ఏళ్లు దాటిపోతున్నా ఎంతోమంది యువకులు పెళ్లిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
  • ఎవరైనా చనిపోతే  ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. 
  •  ఇదంతా ఊరికే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement