ధర్మం చెప్పడానికి ప్రమాణాలుగా శృతి, స్మతి, పురాణం, శిష్టాచారమ్ కాగా చిట్టచివరిది– అంతరాత్మ ప్రబోధమ్. లోపలినుంచి భగవంతుడు చెబుతుంటాడు... ఇది తప్పు.. అని చేయకు. ఇది సరైనదే..చెయ్..అన్నప్పుడు చేసేయ్. ఏది చేయమని అంతరాత్మ ప్రబోధించిందో అది ధర్మం. ఏది వద్దని హెచ్చరించిందో అది అధర్మం. అందువల్ల అంతరాత్మ ప్రబోధమ్ చివరి, అథమ ప్రమాణం. కర్తవ్యమ్... నేను చేయవలసినదేది? అక్కడ మొదలు కావాలని చెబుతుంది శాస్త్రం.
నేనేమి చేయాలో నాకు తెలియాలి. అంటే దానికి చదువుకోవాలి.. ఇది దేనికోసం.. భగవంతుని అనుగ్రహం కోసం. భక్తి రెండుగా మొదలవుతుంది. భగవంతుడు వేరు, నేను వేరు అని... నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం మొదలుపెడితే.. ΄ోయి ΄ోయి నది సముద్రంలో కలిసిపోయినట్టు.. అది ఒకటవుతుంది.. అప్పుడు ఇక తానెవరో తెలిసిపోతుంది. అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తూపోతే ఒక సత్యం తెలుస్తుంది. అదేమిటి? ఇది నేను కాదు –అని. నోటితో చెబితే అది తెలిసి΄ోయిందని కాదు... అనుభవంలోకి రావాలి. ఇది.. ఈ శరీరం.. నేను కాదు, లోపల ఒకటి ఉంది. అది నేను. అదే సత్యం. అది కత్తిచేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు.... అదే నేను. అంతే తప్ప ఇది.. అంటే ఈ శరీరం నేను కాదు. .. అని తెలుసుకోవడం. అలా తెలుసుకున్నట్టు గుర్తు ఏమిటంటే... ఇది ..
ఈ శరీరం పడిపోతున్నా... ఇది ‘నేను’ కాదు అని లోపల ఉన్న ‘నేను’ చూస్తూ సాక్షీభూతంగా ఉండడం. ఆ అనుభవంలోకి మారడం దగ్గర ఈశ్వర కృప కావాలి. ఈశ్వర కృప ఎవరికిస్తారు? ‘‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరఃసంయతేంద్రియః/ జ్ఞానం లబ్ద్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి’’ ... శ్రద్ధావాన్ లభతే జ్ఞానం... గురువుగారు చెప్పిన మాట, శాస్త్రాలు చెప్పిన సూత్రం సత్యం అనిముందు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతో, శ్రద్ధతో ప్రారంభం అయినప్పుడు వారికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. చదువుకున్న దాని మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇంద్రియాలను కట్టడి చేస్తాడు.
అక్కడ ‘ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చరితవ్యా... అక్కడ తనను తాను ధర్మచట్రంలో ఇముడ్చుకోగలుగుతాడు. ధర్మాన్ని అతిక్రమించని అర్థకామాలు ΄పొందుతాడు. అప్పుడు ధర్మకామార్థసిద్ధయేత్... గృహస్థాశ్రమానికి ఆశీర్వచనం అయి΄ోయింది. ‘నీకు ధర్మార్థ కామములు సిద్ధించుగాక. ధర్మము నుండి విడివడిపోకుండుగాక!.. మనుష్య జన్మను సద్వినియోగం చేసుకోవడానికి పరమ తేలిక మార్గం–గహస్థాశ్రమం. అంటే నీ కర్తవ్యం తెలియడం దగ్గర మొదలయింది.
కర్తవ్యం తెలియకుండా నేనెవరో తెలుసుకుంటానంటే ... అది సాధ్యం కాదు. దానికది మార్గం కాదు. భగవాన్ రమణులలాగా గోచి పెట్టుకుని... నేనెవరో నాకు తెలిసిపోతుంది .. అంటానంటే కుదరదు. మీరు జ్ఞానిని అనుకరించలేరు. సాధన పండితేనే జ్ఞానం కలుగుతుంది. సాధనకు అర్హత.. అధ్యాపనం బ్రహ్మయజ్ఞః. ఏవి నీకోసం రుషులు ఇచ్చారో వాటిని చదువు. వేదాలన్నీ చదవనక్కరలేదు. రామాయణం, భాగవతం చదువు. భారతం పంచమ వేదం. అది సమస్త పురాణ సారాంశం. అవి చదువు. ఇవి లోకం కోసం ఇస్తున్నా.. అన్నాడు వ్యాసుడు.
(చదవండి: మార్పు మనుగడ కోసమే...)
Comments
Please login to add a commentAdd a comment