అయ్యారే... లేడీస్‌ టైలర్‌..ఈ డిజైన్స్‌కి మగువలు ఫిదా! | Meet this little ladies tailor Max Alexander | Sakshi
Sakshi News home page

అయ్యారే... లేడీస్‌ టైలర్‌..ఈ డిజైన్స్‌కి మగువలు ఫిదా!

Published Sat, Dec 21 2024 3:17 PM | Last Updated on Sat, Dec 21 2024 3:33 PM

Meet this little ladies tailor Max Alexander

ఈ బుజ్జిగాణ్ణి మన రాజేంద్ర ప్రసాద్‌ని పిలిచినట్టు ‘లేడిస్‌ టైలర్‌’ అనంటే ఊరుకోడు. ‘ఐ యామ్‌ ఏ ఫ్యాషన్‌ డిజైనర్‌’ అంటాడు. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయి ఉంటారు కానీ అమెరికాకు చెందిన మాక్స్‌ అలెగ్జాండర్‌ మాత్రం కొత్త బట్టలు, సరికొత్త ఫ్యాషన్లు, నూతన ఆలోచనలు అంటూ హడావిడిగా ఉంటాడు. అతి చిన్న ఫ్యాషన్‌ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న మాక్స్‌ రూపొందించే దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కీలకమైన వేడుకల్లో అతను తయారు చేసే బట్టలే వేసుకుంటామని కొందరు సెలబ్రెటీలు హటం చేస్తారు. అనగా మంకుపట్టు పడతారు.

మాక్స్‌కి నాలుగేళ్ల వయసున్నప్పుడు అతని తల్లి షెర్రీ మాడిసన్స్‌  అతనికో బొమ్మ ఇచ్చింది. దాని కోసం కస్టమ్‌ కోచర్‌ గౌన్‌ కుట్టాడు మాక్స్‌. అప్పటి నుండి ఇప్పటిదాకా 100 కంటే ఎక్కువ కస్టమ్‌ కోచర్‌ గౌన్లు కుట్టాడు. అతని ఆస్తకిని గమనించి  తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. తాను తయారుచేసిన దుస్తులతో అనేక రన్‌వే షోలను నిర్వహించి, ప్రపంచంలో అతి చిన్న వయస్కుడైన రన్‌ వే ఫ్యాషన్‌ డిజైనర్‌గా మాక్స్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు. అతను తయారు చేసిన దుస్తుల్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. 

బట్టలు కుట్టేసి ఇచ్చేయడం మాత్రమే మాక్స్‌ పని కాదు. అవి వేసుకునేవారు ఏం కోరుతున్నారు, వారి ఇష్టాయిష్టాలు ఏమిటి, ఎలాంటి దుస్తులు సౌకర్యంగా అనిపిస్తాయి, ఎలాంటి రంగులు వారి ఒంటికి నప్పుతాయి వంటి అంశాలన్నీ ఆలోచించి  డిజైన్‌ చేస్తాడు. ఈ కారణంగానే అతను రూ΄÷ందించే బట్టలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతోపాటు పనికిరాని వస్తువులతో కూడా కొత్త రకమైన బట్టలు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో మాక్స్‌కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరిన్ని కొత్త ఫ్యాషన్లు రూపొందించాలని, అందుకోసం మరింత సాధన చేయాలని అతను అంటున్నాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement