సొంతంగా వ్యాపారం చేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు వ్యాపారంలో రాణిస్తున్న మహిళా వ్యాపార వేత్తలు చాలామందే ఉన్నారు. అలాంటి సక్సెస్ ఫుల్‌బిజినెస్ విమెన్‌లో ఒకరు వినీతా సింగ్. కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి మరీ ఆమె బవ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సామ్రజ్యానికి సారధి ఆమె. కృషి, సంకల్ప ఉంటే.. కలలు సాకారం కష్టమేమీ కాదని నిరూపించిన షుగర్ కాస్మటిక్స్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలుసు కుందాం!
ఉద్యోగం కోసం ఒకరి దగ్గర పనిచేయడం కాదు...తానే యజమానికిగా పదిమందికి ఉపాధి కల్పించాలని భావించింది వినీతా సింగ్. ఆలోచన వచ్చింది మొదలు క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. మహిళల చర్మ సౌందర్యానికి సంబంధించి స్వదేశీ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
తనదైన మార్కు వేసి 300 కోట్ల రూపాయల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ముఖ్యంగా షార్క్ ట్యాంక్ ఇండియా టీవీ షో ద్వారా వ్యాపారవేత్తగా మరింత పాపులర్ అయింది. అంతేకాదు ఈ షో ద్వారా వినీతా సింగ్ అనేక వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించి విశేషంగా నిలిచారు.
ఎవరీ వినీతా సింగ్
వినీత ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఐఐఎం అహ్మదాబాద్‌లో తన బిజినెస్ స్టడీస్‌ని కొనసాగించింది. 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి MBA పట్టభద్రురాలైంది.లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఆమె ఇంటర్న్‌షిప్ సమయంలో, క్యాంపస్ సెలక్షన్స్‌లో కోటి రూపాయల వేతనంతో ఒక ఆఫర్ లభించింది. కానీ వ్యాపారంలో రాణించాలన్న కోరికతో ఉద్యోగంలోని చేరేందుకు సుముఖత చూపించలేదు. వినీత స్వంతంగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. అలా స్నేహితుడు కౌశిక్‌తో కలిసి బ్యూటీ సబ్‌స్క్రిప్షన్ కంపెనీలను ప్రారంభించింది. అవిపెద్దగా సక్సెస్ కాలేదు.
అయినా నిరాశపడలేదు. దేశంలో కాస్మోటిక్స్ బ్రాండ్లు పెద్దగా లేని నేపథ్యంలో మేకప్ బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. అలా 2015లో డైరెక్ట్-టు-కన్స్యూమర్ మేకప్ బ్రాండ్‌గా కౌశిక్‌తో కలిసి షుగర్ కాస్మెటిక్స్ కంపెనీని ప్రారంభించింది. భారతీయులకోసం ప్రత్యేకంగా ఇండియన్ స్కిన్ టోన్‌ల కోసం స్వదేశీ మేకప్ ఉత్పత్తులను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఉత్తరప్రదేశ్‌లో, తొలి స్టోర్ తెరిచింది. 20-35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియాలో బాగా ప్రచారం నిర్వహించి సక్సెస్ అయింది.
ఎంబీఏ చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన వినీతా సింగ్ ప్రియుడు కౌశిక్ ముఖర్జీరి 2011లో పెళ్లి చేసుకుంది. కౌశిక్ షుగర్ కాస్మెటిక్స్ కంపెనీకి సీవోవో, కో ఫౌండర్‌గా ఉన్నారు. దంపతులుగానే కాదు, వ్యాపారవేత్తలుగా ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించు కున్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి గాను షుగర్ కాస్మెటిక్స్ ఆదాయం సంవత్సరానికి 89 శాతం పెరిగి రూ. 420 కోట్లకు చేరుకుంది. నికర నష్టం దాదాపు రూ.76 కోట్లుగా ఉంది. మహిళా వ్యాపారవేత్తగా రాణించడం అంత సులువు కాదు అంటారామె. ఒక దశలో ఒక ఇన్వెస్టర్ నన్ను కలవడానికి కూడా ఇష్టపడలేదు. పురుషు వ్యాపారవేత్తల్నే కలవానేది అతని లక్ష్యం కానీ ఈ రోజు తన కంపెనీ బ్రాండ్ వాల్యూ వేల కోట్లకు చేరిందని ఆమె చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment