ఇటీవల సోషల్ మీడియా పిచ్చితే యువత చేసే పనులకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఇలాంటి పిచ్చి ఫీట్‌లతో కొందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఏకంగా సొంత కొడుకుపై పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి సెలబ్రెటీ అయిపోవాలనుకున్నాడు. నెలల పసికందు అని కూడా చూడకుండా అతడు చేసిన దారుణ కృత్యాలకు బలైపోయింది ఆ చిన్ని ప్రాణం. చివరికీ ఈ విషయం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..?
రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం తినడం గురించి చెబుతూ ఎక్కువ మంది యూజర్లను పొందే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని నమ్మడలికి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే తన సొంత కొడుకు పైనే ఇలాంటి చెత్త ప్రయోగాలే చేశాడు. నిజానికి ఒక మనిషి ఆహారం తీసుకుంటేనే బతుకగలడు. కానీ ఈ దుర్మార్గుడు సూర్యరశ్మితో కూడా ఓ మనిషి బతకగలడిని నిరుపించాలనేది మాక్సిమ్ ఆలోచన. అస్సలు ఇది సాధ్యమా..? సూర్యుడి ప్రతాపానికి చెట్టు చేమలు విలవిల్లాడతాయి.
సూర్యుడి శక్తి మనకు ఆకలిపుట్టించేలా చేసి చైతన్యవంతం చేస్తుంది. అంతే దానితో బతకాలనుకోవడం అత్యంత పిచ్చి ఆలోచన. కానీ మాక్సిమా తన కొడుకు నెలల పనికందుపై ఈ ప్రయోగం చేశాడు. భార్య ఎంతలా చెప్పిన వినలేదు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నారీతీలో మూర్ఖంగా ప్రవర్తించాడు. బిడ్డకు పాలు ఇవ్వకుండా సూర్మరశ్చిలోనే ఉంచేవాడు. పాపం ఆ భార్య అతడికి తెలియకుండా బిడ్డకు పాలు ఇస్తుండేది. రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. మరోవైపు ఇతడి ఆగడాలు శృతిమించాయి. చల్లటి నీళ్లల్లో బిడ్డను ముంచి ఎండలో ఉంచడం వంటి పిచ్చి పనులు చేసేవాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న కంగకుండా ఆకలిని అధిగమించేలా శక్తిని పొందుతున్నాడని భార్యకు ఏవేవో పిచ్చి కబుర్లు చెప్పేవారు.
చివరికీ బాబు ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. దీంతో భార్య ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. మాక్సిమ్ పిచ్చి ప్రయోగాలు ఆ బిడ్డ ప్రాణం బలైపోయింది. వైద్య పరిక్షల్లో ఆ పసికందు నిమోనియా సహా పలు సమస్యల వల్ల చనిపోయినట్లు వెల్లడయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాక్సిమ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని బుకాయించే యత్నం చేశాడు. అయితే అతడి భార్య ఈ బాధను ఓర్చుకోలేక పోలీసులు ముందు జరిగిన విషయం అంతా చెప్పేసింది. దీంతో కోర్టు జరిగిన నేరంలో తల్లి పాత్ర కూడా ఉందని భావించి ఇరువురకి జైలు శిక్ష విధించింది. మాక్సిమ్‌కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. విచిత్రమేమిటంటే తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడలన్నాదే తన ఉద్దేశ్యమని వాదిస్తూనే ఉన్నాడు.
అతడి వాదనతో కోర్టు ఏకభవించ లేదు. ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో పచ్చి కూరగాయాలతో మంచి ఆరోగ్యం అని చెప్పే మాక్సిమ్ కస్టడీలో ఉన్నప్పుడూ న్యూడిల్స్, మాంసాహారం అడిగేవాడట. దయచేసి ఇలాంటి పిచ్చి పనులతో సోషల్ మీడియా ఫేమ్ రాదు కదా..! ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నాన్‌వెజ్ తినేవాళ్లకు వ్రతాలు, పూజలు పేరుతో నాన్‌వెజ్‌కి దూరం ఉంటేనే అబ్బా నాలుకు చప్పబడిపోయినా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది పూర్తిగా శాకాహారం అంటే చాలా కష్టం. ఇది వ్యక్తిగతంగా రావాల్సిన మార్పు. అనుకున్నదే తడువుగా చేసేయడం అన్నది సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియా లేదా మరేదైనా క్రేజ్ కోసం అయినా ఏదైనా సాహసం చేయాలనుకుంటే సాధ్యసాధ్యాలు గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి.
Comments
Please login to add a commentAdd a comment