సాగరంలో సౌరవిహారం.. | This Sleek 144 Foot Solar Powered Catamaran Was Designed by Zaha Hadid Architects | Sakshi
Sakshi News home page

సాగరంలో సౌరవిహారం

Published Sun, Jun 19 2022 4:29 PM | Last Updated on Sun, Jun 19 2022 4:29 PM

This Sleek 144 Foot Solar Powered Catamaran Was Designed by Zaha Hadid Architects - Sakshi

ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రపంచం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. సౌరశక్తితో నడిచే వాహనాలు కూడా కొన్నిచోట్ల నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన జాహా హాడిడ్‌ ఆర్కిటెక్ట్స్‌ సంస్థ వందశాతం సౌరశక్తితో పనిచేసే 42 మీటర్ల పొడవైన విలాసవంతమైన నౌకను రూపొందించింది.

ఈ నౌక పైకప్పుపై అమర్చిన సోలార్‌ ప్యానెల్స్‌ ఇందులోని బ్యాటరీలను నిరంతరం చార్జ్‌ చేస్తుంటాయి. ఫలితంగా పొద్దుగూకిన తర్వాత కూడా ఈ బ్యాటరీలు భేషుగ్గా పనిచేస్తాయి. మామూలు ఇంధనంతో పనిచేసే నౌకలు దాదాపు 40 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఈ సౌరనౌక నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ ఏమాత్రం విడుదల కాదు. ఇలాంటి వాహనాలు విరివిగా వినియోగంలోకి తెస్తే, ఉద్గారాల జోరుకు కళ్లాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement