బ్రిక్స్‌ దేశాలు సాధించింది శూన్యం | Sakshi Guest Column On BRICS Countries By Pankaj Mishra | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ దేశాలు సాధించింది శూన్యం

Published Thu, Sep 14 2023 1:04 AM | Last Updated on Thu, Sep 14 2023 1:04 AM

Sakshi Guest Column On BRICS Countries By Pankaj Mishra

దక్షిణాఫ్రికా వేదికగా ‘బ్రిక్స్‌’ దేశాల 15వ సమావేశం ముగిసింది. అంతర్జాతీయ సమాజం ఈ సమావేశాలపై అనూహ్యంగా తన దృష్టిని కేంద్రీకరించింది. వ్యాఖ్యాతలు కొందరు ఇంకో అడుగు ముందుకేసి దీన్ని 1955 నాటి బండుంగ్‌ (ఇండోనేషియా) సమావేశాలతో పోల్చారు.

బండుంగ్‌ వేదికగానే భారత్‌ సహా చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్‌ యుగొస్లావియా కలసికట్టుగా అలీనోద్యమాన్ని ప్రకటించాయి. తాజా సదస్సులో బ్రెజిల్, రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా నవతరం నేతలు అమెరికా ఆధిపత్య ప్రపంచానికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించే ప్రయత్నం చేసినంత హడావిడి జరిగింది. 

ప్రత్యామ్నాయం ఏమిటి?
అయితే... సమావేశాలు నడుస్తున్న కొద్దీ వీటి డొల్లతనం ఇట్టే బయటపడింది. ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి రాకపోవడంతో, భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానంలోంచి దిగేందుకు నిరాకరించి నట్లు ప్రముఖ దక్షిణాఫ్రికా వెబ్‌సైట్‌ ఓ వార్త ప్రచురించింది. ఇతర నాయకులతో పాటు వీడియో లింక్‌ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉపన్యసించిన ప్రారంభ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కారణం చెప్పకుండా, ఇవ్వాల్సిన ఉపన్యాసం ఇవ్వలేదు. 

యుద్ధ నేరాల పేరుతో ఎక్కడ తనను అరెస్ట్‌ చేస్తారో అన్న భయంతో దక్షిణాఫ్రికాకు రాలేకపోయిన పుతిన్  యథావిధిగానే ఉక్రెయిన్  మీద తమ యుద్ధానికి బాధ్యత పాశ్చాత్య దేశాలదేనని నిందించారు. చైనా అధ్యక్షుడు తన ప్రసంగంలో పేరు చెప్పకుండా, కానీ దేని గురించో తెలి సేట్టుగా ఒక దేశం ‘తన ఆధిపత్యాన్ని ఎలాగైనా కొనసాగించాలన్న పంతంతో’ ఉందనీ, చైనా ప్రగతిని అడ్డుకుంటోందనీ వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనా సియోలులా డ సిల్వా ప్రసంగం మాత్రం కొంత కల్లోలం చేసిందని చెప్పాలి. డీ–డాలరైజేషన్, బ్రిక్స్‌కు ప్రత్యా మ్నాయం వంటి అంశాలపై ఈయన మాట్లాడారు. కానీ ఏ ఫలితమూ రాలేదు.

బ్రిక్స్‌ సభ్యదేశాల సంఖ్యను పెంచే విషయంతో ఈ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. సంక్షోభంలో ఉన్న అర్జెంటీనా, ఇథియోపియాలతోపాటు చమురు నిల్వలు పుష్టిగా ఉన్న సౌదీ అరేబియా, ఇటీవలిదాకా దీని ప్రత్యర్థి దేశం ఇరాన్  ఇప్పుడు బ్రిక్స్‌ బృందంలో చేరనున్నాయి. అయితే ఏ ప్రత్యామ్నాయ సంస్థలు బ్రిక్స్‌ నిర్మిస్తుందో మాత్రం స్పష్టం కాలేదు. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వడం కోసం జరగాల్సిన విలేఖరుల సమావేశాన్ని కాస్తా,   జర్న లిస్టులకు ‘విశ్రాంతి’ పేరుతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామ ఫోసా చివరి నిమిషంలో రద్దు చేశారు.

అమెరికా సెక్యురిటీస్‌ సంస్థలో పెట్టుబడులను రాబ ట్టేందుకు ఓ బ్రిటిష్‌ ఆర్థికవేత్త యథాలాపంగా పెట్టిన ‘సంక్షిప్త నామం’తో నడుస్తున్న బ్రిక్స్‌ సదస్సు నుంచి ఇంతకంటే గొప్పగా ఏమీ ఆశించలేము. అయితే అమెరికా నేతృత్వంలోని వ్యవస్థకు ప్రతిగా ఏర్పాటైన చాలా ముఖ్యమైన సంస్థ బ్రిక్స్‌ అని డబ్బా కొట్టుకోవడాన్ని మాత్రం ఎలా పరిహరించవచ్చో ఆలోచించాలి. పాశ్చాత్య దేశాల భౌగో ళిక, ఆర్థిక పెత్తనానికి చెక్‌ పెట్టేందుకు ఒక దీటైన సంస్థ కోసం ప్రపంచం శతాబ్దానికి పైగా ఎదురు చూస్తోంది. అయితే ఇలాంటి ఓ సంస్థ ప్రాముఖ్యతను గుర్తించడంలో పాశ్చాత్య జర్నలిస్టులు విఫలమవుతూండటం విచారకరం.

దూరదృష్టి కరవు
ఒక విషయమైతే స్పష్టం. బ్రిక్స్‌కూ, అలీనోద్యమానికీ ఏమాత్రం సారూప్యత లేదు. 1950లు అంటే ఇండియా, ఈజిప్టు, చైనా... జాతీయోద్యమాలు, వలస పాలనకు వ్యతిరేక సంఘర్షణల నుంచి అప్పుడప్పుడే బయట పడు తున్న కాలం అది. ఆర్థికాభివృద్ధి విషయంలో అందరికీ సమాన అవకాశాలిచ్చే అంతర్జాతీయ వ్యవస్థ ఒకటి అవస రమని అప్పటి నాయకులు నిజాయితీగా నమ్మారు.

ఈ నమ్మకంలో భాగంగానే న్యూ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ ఆర్డర్‌ వంటివి బయటకు వచ్చాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... బండుంగ్‌ సమావేశపు ప్రతి నిధు లకు ఉన్న దార్శనికత, దూరదృష్టి దక్షిణాఫ్రికా బ్రిక్స్‌ సదస్సులో అస్సలు కనిపించకపోవడం. వాస్తవానికి మారి పోతున్న పరిస్థితుల్లో తామేం చేయాలన్నది ఇప్పుడి ప్పుడే వీళ్లు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. 

కొత్తగా చేరిన సభ్యులతో సహా అన్ని బ్రిక్స్‌ దేశాల సాధారణ ‘విజన్‌’ ఏంటంటే– వాణిజ్యం, టెక్నాలజీ, మిలి టరీ ఒప్పందాల్లో తమకు ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా అమెరికా, యూరప్‌లతో బేరాలు సాగించగలగడం. ఇంతకంటే భిన్నంగా ఉండే అవ కాశం లేదు. 

భారత్‌నే ఉదాహరణగా తీసుకుందాం. వ్యూహాత్మకంగా శత్రువైనప్పటికీ చైనా నుంచి చౌక వస్తువులు కావాలి. చౌక ధరల్లో రష్యా నుంచి ముడి చమురు కావాలి. మిలిటరీ టెక్నాలజీ, ఆయు ధాల్లాంటివి అమెరికా, యూరప్‌ల నుంచి తెచ్చు కోవాలి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి పెట్టుబడులూ కావాలి. అందుకు తగ్గట్టుగానే భారత్‌ విదేశాంగ విధా నమూ ఉంటుంది.

ఒంట రిగానైనా, గుంపుగానైనా ఆయా దేశాలకు కట్టుబడి ఉండేలా వ్యవహరిస్తుందన్నమాట! గ్లోబల్‌ సౌత్‌కు నేతృత్వం వహిస్తున్నామనీ, అందుకే వరి, చక్కెరల ఎగు మతులపై నిషేధం విధిస్తున్నామనీ కూడా భారత్‌ ప్రకటించుకోలేదు. ఈ విషయంలో చైనాకు ఎంతో కొంత మంచి పేరున్నా... రోజురోజుకూ ముదిరిపోతున్న ఆర్థిక సంక్షో భాన్ని తట్టుకోవడంలోనే ఆ దేశం తలమున కలై ఉంది. సభ్యులు, పెరిగినా, తగ్గినా బ్రిక్స్‌తో ప్రయోజనం శూన్య మని అర్థం చేసుకునేందుకు బహుశా వచ్చే ఏడాది రష్యాలో జరగనున్న సదస్సు వరకూ వేచి చూడా ల్సిన అవసరం లేదేమో!

పంకజ్‌ మిశ్రా 
వ్యాసకర్త నవలా రచయిత, సామాజిక విశ్లేషకుడు
(‘బ్లూమ్‌బర్గ్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement