ప్రజల పక్షాన సీపీఐ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన సీపీఐ పోరాటం

Published Thu, Jan 30 2025 1:21 AM | Last Updated on Thu, Jan 30 2025 1:21 AM

ప్రజల

ప్రజల పక్షాన సీపీఐ పోరాటం

హన్మకొండ: ప్రజల పక్షాన సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలో సీపీఐ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలాపార్క్‌ నుంచి నక్కలగుట్టలోని హరిత కాకతీయ వరకు ప్రజానాట్య మండలి ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హరిత కాకతీయ హోటల్‌లో జరిగిన సమావేశంలో చాడ వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సీపీఐ 1925 డిసెంబర్‌ 26న ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో స్థాపించారన్నారు. రాచరికపాలన సాగుతోన్న ఆ కాలంలో అప్పటికే ఉన్న కాంగ్రెస్‌ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులను అంతం చేయాలనే దురాలోచన చేస్తుందని, ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులకు అంతం లేదన్నారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లను అంతం చేయడం బీజేపీ వల్ల కాదన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు, పేదల కాలనీల్లో మౌలిక వసతులు వచ్చేంతవరకు పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, నాయకులు సిరబోయిన కరుణాకర్‌, ఆదరి శ్రీనివాస్‌, మంద సదాలక్ష్మి, పంజాల రమేష్‌, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్‌, కర్రె లక్ష్మణ్‌, భిక్షపతి, బాషబోయిన సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు

చాడ వెంకట్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజల పక్షాన సీపీఐ పోరాటం1
1/1

ప్రజల పక్షాన సీపీఐ పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement