అధికార లాంఛనాలతో వంశీ అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో వంశీ అంత్యక్రియలు

Published Thu, Jan 30 2025 1:21 AM | Last Updated on Thu, Jan 30 2025 1:21 AM

అధికా

అధికార లాంఛనాలతో వంశీ అంత్యక్రియలు

హసన్‌పర్తి: గుజరాత్‌ రాష్ట్రం పోరుబందర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నౌకాదళ అధికారి (ప్రధాన్‌ యాంత్రిక్‌) ఆకుల వంశీ కృష్ణ(20) మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఐదుగురు నేవీ సిబ్బంది అహ్మదాబాద్‌ నుంచి వంశీ మృతదేహాన్ని హసన్‌పర్తికి తీసుకొచ్చారు. వంశీ కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వంశీ మృతదేహంపై జాతీయ జెండా కప్పి సెల్యూట్‌ చేశారు. అనంతరం గౌరవ సూచకంగా గాలిలో మూడురౌండ్లు కాల్పులు జరిపారు. వంశీ కృష్ణ మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి రాజేందర్‌ను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కిరణ్‌, ఆరెల్లి వెంకటస్వామి, కాంగ్రెస్‌ నాయకులు పెద్దమ్మ నర్సింహారాములు, రవి, పుల్లా రవి తదితరులు ఉన్నారు. స్థానిక కార్పొరేటర్‌ గురుమూర్తి శివకుమార్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్‌, చకిలం రాజేశ్వర్‌రావు తదితరులు నివాళులర్పించా రు. వంశీ అంతిమ యాత్రలో వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మృతదేహంపై జాతీయ జెండా కప్పి సెల్యూట్‌

నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
అధికార లాంఛనాలతో వంశీ అంత్యక్రియలు1
1/1

అధికార లాంఛనాలతో వంశీ అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement