
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
● భద్రకాళి అమ్మవారికి లక్ష పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
నేడు వీరాంజనేయుడి కల్యాణం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే దేవాలయ సముదాయంలో సోమవారం శ్రీవీరాంజనేయస్వామి సువర్చలదేవి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న ట్లు ఆలయ కమిటీ సెక్రటరీ పెసరు భాస్కర్‌రావు, కార్యక్రమ నిర్వాహకులు ఏఎస్‌ఆర్.ప్రసాదరావు తెలిపారు. అనంతరం సత్యనారాయణస్వామి వారి సామూహిక వ్రతం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1,500 మందికి మహా అన్నదానం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
నేడు విద్యుత్ లోకల్ కోర్టు
హన్మకొండ: నాగారం సబ్‌స్టేషన్‌లో ఈనెల 7న విద్యుత్ లోకల్ కోర్టు నిర్వహించనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హసన్‌పర్తి డీఈ అశోక్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేపట్టే లోకల్ కోర్టులో విద్యుత్ వినియోగదా రుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్) చైర్మ న్ ఎన్.వి.వేణుగోపాలచారి పాల్గొంటారన్నారు.

ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు