
చిలకలగూడ: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో వరుసగా మూడుసార్లు విజయం సాధించినవారు లేరు. ఇక్కడి నుంచి ప్రస్తుతం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకుని ‘సికింద్రాబాద్ సెంటిమెంట్’కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘కుటుంబ సభ్యుల సెంటిమెంట్’ను ప్రవేశపెట్టారు. ఆయనకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ప్రచార రంగంలోకి దిగారు. కుమారులు కిషోర్‌కుమార్, కిరణ్‌కుమార్, రామేశ్వర్, త్రినేత్ర, కోడళ్లు శ్వేత, రోజా, శిల్ప, తేజశ్విని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి పద్మారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. నలుగురు కుమారులతో పాటు కోడళ్ల ఎన్నికల ప్రచారం సెంటర్ ఆఫ్ ఎంట్రాక్షన్‌గా నిలుస్తోంది. పద్మారావు హ్యాట్రిక్ గెలుపు ఖాయమని కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

పద్మారావు కోడళ్లు (వృత్తంలో)
Comments
Please login to add a commentAdd a comment