ఉత్తర్వులు జారీ చేసిన రక్షణ శాఖ
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు (సీఎన్‌ఎమ్) రామకృష్ణ పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేనెల 10వ తేదీతో ప్రస్తుత వెరీడ్ బోర్డు ముగియనుండగా, బోర్డు పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ గత నెల 31న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సభ్యుల వేరీడ్ బోర్డులో కంటోన్మెంట్ బోర్డ్ అధ్యక్షుడు, సీఈఓ ఇద్దరు అధికారులతో పాటు కేంద్రం నియమించిన సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు మూడో మెంబర్ గా కొనసాగుతారు. 2022 నవంబర్ నెలాఖరున రామకృష్ణ తొలిసారిగా సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా నియమితులయ్యారు. నాటి నుంచి కేంద్రం వెరీడ్ పదవీ కాలాన్ని పొడిగించిన ప్రతిసారి రామకృష్ణ నే సభ్యుడిగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనపై నమ్మకంతో పదవీ కాలాన్ని పొడిగించడం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment