నూతనోత్సాహంతో పని చేయండి
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేయాలని ఎకై ్సజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. ఎస్టీఎఫ్ పని తీరు బాగుందని, గతేడాది ఆశించినదానికంటే రెట్టింపు ఫలితాలు లభించాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం అబ్కారీ భవన్‌లోని సమావేశ మందిరంలో ఎస్టీఎఫ్ పనితీరుపై సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి, ,డ్రగ్స్‌తో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని సూచించారు. పదే పదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే రైళ్లలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగంపైన దృష్టి సారించి దాడులు నిర్వహించాలన్నారు. మత్తుపదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లను చేపట్టాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఏ,బీ,సీ,డీ టీమ్‌లు ఉన్నాయి. నాలుగు టీమ్‌లకు సివిల్ పోలీస్ విభాగం నుంచి ఇద్దరు డీఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ, మరో టీమ్‌లో ఇద్దరు ఎకై ్సజ్ సూపరిండెంట్ స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు టీమ్‌లలో 78 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా విధులు నిర్వహించాలని జాయింట్ కమిషనర్ ఖురేషీ అన్నారు.
పాత కేసుల్లో కరుడుగట్టిన నిందితుల సమాచారాన్ని నాలుగు టీమ్‌లకు అందజేయాలని అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిని డైరెక్టర్ అదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారులు నంద్యాల అంజిరెడ్డి, ప్రదీప్‌రావు,తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.
ఎస్టీఎఫ్ పనితీరు బాగుంది...
గంజాయి,డ్రగ్స్,ఇతర మత్తుపదార్థాలపై నిఘా పెట్టండి
ఎకై ్సజ్ ఎన్ ఫోర్స్‌మెంట్‌డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment