సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలిపులి వణికిస్తోంది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. తెల్లవారుజామున పొగమంచు రోడ్లను కమ్మేస్తోంది. పగటిపూట చల్లని గాలులతో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు దాటడం లేదు. సగటున కనిష్ట ఉష్ణోగ్రతలు 13.6 డిగ్రీలుగా నమోదైంది. శివార్లలో మాత్రం అత్యల్పంగా రికార్డు స్థాయిలో 9.6 డిగ్రీలు నమోదైంది. సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు మైనస్‌లో పడిపోయింది. వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment