మీ– టికెట్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వివిధ సేవలకు టికెట్ బుకింగ్ సులభతరం చేసేందుకు ఐటీఈ అండ్‌సీ రూపొందించిన ’మీ– టికెట్’ మొబైల్ అప్లికేషన్‌ను గురువారం మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో రైలు, టీజీ ఆర్టీసీ, దాదాపు 130 పబ్లిక్ పార్కులు, ఫారెస్ట్ అర్బన్ పార్కులు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ పార్కులు, జూ పార్కు, బొటానికల్ గార్డెన్ల ఎంట్రీ, 15 ప్రధాన దేవాలయాలకు ఆలయ దర్శన, సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోటింగ్ టికెట్లు వంటి దాదాపు 54 పర్యాటక ప్రదేశాలు, జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు అన్ని బుకింగ్‌లను కోసం యాప్ ఉపయోగించి బుక్ చేసుకోవచ్చు. ప్రతీ స్థానానికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని మీ టికెట్ యాప్ ఉపయోగించి బుకింగ్ టికెట్ల కోసం స్కాన్ చేయాలి. టికెట్ల సంఖ్య, టికెట్ల రకం వివరాలు తెలుసుకొని జీపే, ఫోన్ పే తదితర యూపీఏ అప్లికేషన్లను ఉపయోగించి చెల్లింపులు చేయొచ్చు. కార్యక్రమంలో తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మల్సూర్, కమిషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment