జనావాసాల్లో పతంగులు ఎగరేయొద్దు
డీజేల వినియోగం పైనా నిషేధం
● నిర్దేశిత వేళల్లోనే స్పీకర్లు వాడాలి
● ఉత్తర్వులు జారీ చేసిన కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో పతంగులు ఎగరవేయడాన్ని నిషేధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం 6 వరకు ఇవి అమలులో ఉంటాయి. దీంతో పాటు పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో తల్లిదండ్రులూ కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలని ఆనంద్ సూచించారు. విద్యుత్ తీగలకు సమీపంలో, పిట్టగోడలు లేని డాబాలపైనా ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెగిన పతంగుల కోసం రోడ్డుపై, ప్రమాదకర ప్రాంతాల్లోనూ పిల్లలు పరుగులు పెట్టుకుండా శ్రద్ధ వహించాలని ఆయన కోరా రు. భోగి మంటల నేపథ్యంలో యజమానుల అను మతి లేకుండా చెక్క, ఇతర వస్తువులు తీసుకోవద్దని స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో పోలీసుల అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, డీజేల వినియోగాన్ని నిషేధించారు. అనుమతి ఉన్నప్ప టికీ లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం తదితరాలను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment