మద్యం మత్తులో..
మణికొండ: మద్యం మత్తు రెండు కార్ల ప్రమాదానికి కారణమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన వెంకట సుబ్బయ్య తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాయదుర్గం ప్రాంతానికి చెందిన చిన్నగౌడ్ తన స్కార్పియోలో మర్రిచెట్టు సర్కిల్ వైపు వెళుతున్నాడు. అదే సమయంలో మర్రిచెట్టు సర్కిల్ నుంచి ఓయూ కాలనీ వైపు వస్తున్న శాంత్రో కారులో వస్తున్న వెంకటసుబ్బయ్య ఎస్‌బీఐ బ్యాంకు ముందుకు రాగానే ఎదురుగా వస్తున్న స్కార్పియోను వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో స్కార్పియో ముందు టైరు విరిగిపోగా, శాంత్రో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. శాంత్రో కారులో బెలూన్ ఓపెన్ కావడంతో ఎవరికీ గాయాలు కాలేదు. వెంకట సుబ్బయ్య అతిగా మద్యం తాగటం, డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకుండా అతి వేగంగా కారు నడపటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు పారిపోగా, డ్రైవింగ్ చేస్తున్న వెంకట సుబ్బయ్యను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరగటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం పోలీసులు వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
మణికొండలో భారీగా
నిలిచిపోయిన వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment