గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
అమీర్‌పేట: విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..బాపట్లకు చెందిన వినయ్ భాస్కర్ (53) ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డ్యూటీకి వచ్చాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుండె పోటు రావడంతో సిబ్బంది అతడిని అమీర్‌పేటలోని వెల్‌నెస్ ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేయడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తుండగా అర్థరాత్రి రెండో సారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినయ్ భాస్కర్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్ సిబ్బందితో కలిసి బోయిన్ పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.కో–ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.50 వేలు, శాఖ తరఫున రూ.30 వేలు ఆర్థికసాయం అందజేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment