మలక్‌పేట: నగదు ఇస్తానని చెప్పి గుర్తుతెలియని వ్యక్తి ఓ వ్యాపారి నుంచి రూ. 75 వేలు గూగుల్‌పేకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని పరారైన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్బర్‌బాగ్ డివిజన్, ఆంధ్రాకాలనీకి చెందిన తిప్పన జనార్దన్‌రెడ్డి మలక్‌పేట సూపర్‌బజార్‌లో జిరాక్స్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం యాక్టీవాపై అక్కడికి వచ్చిన గుర్తు తెలియని జనార్దన్‌రెడ్డిని మాటల్లో పెట్టాడు. అత్యవసర పరిస్థితి ఉన్నందున రూ.75 వేలు గూగుల్ పే చేయాలని, నగదు ఇస్తానని కోరాడు. అతడి మాటలు నమ్మిన జనార్దన్‌రెడ్డి నగదు బదిలీ చేశాడు. నగదు బైక్ డిక్కీలో ఉందని తీసుకొస్తానని బయటికి వచ్చిన అతను అక్కడి నుంచి పరారయ్యాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక యూకే బ్యాంక్‌లో తన అకౌంట్ ఫ్రీజ్ చేయించాడు. కాగా అగంతకుడు అప్పటికే అందులో నుంచి రూ.50 వేలు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
● వృద్ధుడికి టోకరా
● రూ.75వేలు బదిలీ చేయించుకుని పరారీ
Comments
Please login to add a commentAdd a comment