ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100 శాతం పెనాల్టీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారికి లైసెన్స్ ఫీజుతో పాటు 100 శాతం పెనాల్టీ విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. లైసెన్స్ పొందేంత వరకు నెలకు 10 శాతం ఫైన్ కూడా అదనంగా విధించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కమిషనర్ ఇలంబర్తి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ట్రేడ్ లైసెన్సులున్న వారు పెనాల్టీలు లేకుండా ఉండేందుకు ఈ నెలలోగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం పెనాల్టీ, ఏప్రిల్ 1 నుంచి 50 శాతం పెనాల్టీ పడుతుందని పేర్కొన్నారు.
పెనాల్టీలు పడకుండా ఉండేందుకు మీసేవ కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ పౌరసేవ కేంద్రల్లో సంప్రదించి రెన్యువల్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు లైసెన్సులు పొందనివారు ఆన్‌లైన్ ద్వారా కానీ.. మీసేవ కేంద్రాల ద్వారా కానీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ను (www. ghmc.gov.in) చూడాలని ఇలంబర్తి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment