ఎగ్జిబిషన్ సందర్శకులకు అందుబాటులో వైద్య సేవలు
అబిడ్స్: ఎగ్జిబిషన్ సొసైటీ ఏటా నుమాయిష్‌లో సందర్శకులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన హెల్త్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ...... ఈ కేంద్రంలో ఉచితంగా పలు సేవలు అందిస్తున్నారన్నారు. ఏటా వేలాది మంది సందర్శకులకు వైద్య కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎగ్జిబిషన్ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యశోధ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లింగయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సీనియర్ సభ్యులు డాక్టర్ వంశీ తిలక్, ఎగ్జిబిషన్ సొసైటీ హెల్త్ సెంటర్ కన్వినర్ డాక్టర్ సంజీవ్‌కుమార్, అడ్వైజర్ డాక్టర్ జి.శ్రీనివాస్, జాయింట్ కన్వినర్ డాక్టర్ వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment