గుడిమల్కాపూర్ మార్కెట్‌కు సరికొత్త హంగులు
గోల్కొండ: గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌కు సరికొత్త హంగులు చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం గుడిమల్కాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్‌గా తలారి మల్లేష్ ముదిరాజ్ నియమితులు కావడం రైతులకు మేలు చేకూర్చే విషయమన్నారు. మార్కెట్ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాత్రి పూట వచ్చే రైతుల కోసం విశ్రాంత గదులు ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. కమీషన్ ఏజెంట్లు, మెండేదారులు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 50 ఎకరాల భూమి సేకరించి గుడిమల్కాపూర్ మార్కెట్‌ను అక్కడికి తరలిస్తే మార్కెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులకూ దూరభారం తగ్గుతుందన్నారు. మార్కెట్ అభివృద్ధికి, రైతుల ప్రయోజనాల కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, కాలె యాదయ్య, కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం
Comments
Please login to add a commentAdd a comment