వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ పంజా విసురుతోంది. కరోనా ధాటికి అగ్రరాజ్యం చిగురాటాకులా వణుకుతోంది. గడిచిన 24 గంటల్లో 58 వేల కొత్త కేసులు నమోదవ్వగా 2,060 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. గత మూడు నెలల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇదే అత్యధికమని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గురువారం తెలిపింది. అంతకుముందు మే 7న అమెరికాలో ఒకే రోజు 2 వేలకు పైగా మరణాలు సంభవించాయని వెల్లడించింది. (అమెరికా అధ్యక్షుడికి ఫేస్‌బుక్ షాక్)
ఇక అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5 మిలియన్లు దాటింది. గురువారం నాటికి 5,032,179 పాజిటివ్ కేసులు నమోదవ్వగా మృతుల సంఖ్య 1,62,804కు చేరింది. 2,576,668 మంది కోలుకున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 19 మిలియన్ల జనాభా కరోనా బారిన పడ్డారు. మొత్తం 19,254,157 మందికి కరోనా సోకగా.. 7,17,655 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 12,355,351 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (చైనాను వణికిస్తున్న మరో మాయదారి వైరస్)
Comments
Please login to add a commentAdd a comment