ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య ప్రకటించి.. దాదాపు ఇరవై రోజులు కావస్తోంది. ఉక్రెయిన్ త్వరగానే లొంగిపోతుందని భావించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఒకవైపు యుద్ధంతో ఉక్రెయిన్ చిధ్రం అవుతుండగా.. యుద్ధ సామాగ్రి సైతం తగ్గిపోతుండడంతో మిత్రదేశాల సాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్ పట్ల నిన్నమొన్నటిదాకా సానుకూలత ప్రదర్శించిన వాళ్లు సైతం.. ఇప్పుడు స్వరం మారుస్తున్నారు.
ఉక్రెయిన్‌పై దురాక్రమణను ఖండిస్తూ.. సొంత దేశంలోనూ పుతిన్ వ్యతిరేక నిరసనలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, నేరుగా పుతిన్‌కే సవాల్ విసిరాడు.
దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరులో తనతో తలపడాలంటూ సవాల్ విసిరాడు. ఏయ్ పుతిన్ నాతో ఒంటరిగా కలబడి పోరాడు. నీకు ఇదే నా ఛాలెంజ్! అంటూ ట్వీటేశాడు మస్క్. అంతేకాదు గెలిచిన వాళ్లకే ఉక్రెయిన్‌లో వాటా అంటూ.. పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్ భాషలోనే ప్రస్తావించాడు.
ఎలన్ మస్క్ ఏ మూడ్‌లో ఉండి ఈ ట్వీట్ ఏశాడో గానీ విపరీతంగా షేర్లు, లైకులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పుతిన్‌కు ట్విటర్ అకౌంట్ లేదు. అందుకే క్రెమ్లిన్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేసి మరీ ‘త్వరగా బదులు ఇవ్వాలంటూ’ సవాల్ విసిరాడు Musk. ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాగానే తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ వ్యాప్తంగా ఎలన్ మస్క్ అందించిన విషయం తెలిసిందే!.
I hereby challenge
— Elon Musk (@elonmusk) March 14, 2022
Владимир Путин
to single combat
Stakes are Україна
Вы согласны на этот бой? @KremlinRussia_E
— Elon Musk (@elonmusk) March 14, 2022
Comments
Please login to add a commentAdd a comment