వాషింగ్టన్: క్వాడ్ కూటమికి చోదక శక్తి భారతేనని, దక్షిణాసియాలో ప్రాంతీయాభివృద్ధికి సారథ్యం వహిస్తోందని అమెరికా పేర్కొంది. ‘‘భారత్ మా భావ సారూప్య భాగస్వామి. దక్షిణాసియాలో, హిందూ మహాసముద్ర పరిధిలో నాయకత్వ స్థానంలో ఉంది’’ అని వైట్‌హౌస్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్ పియరీ అన్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లతో కూడిన క్వాడ్ ఇటీవలే పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై లోతైన చర్చ జరిగిందని ఆమె చెప్పారు. దక్షిణాసియాలో స్థిరత్వ సాధనతో పాటు ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితరాల్లోనూ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment