photo credit: THE TIMES OF ISRAEL
టెల్‌అవీవ్: ఇజ్రాయెల్‌కు పీడకలగా మిగిలిన గతేడాది హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ఇంటెలిజెన్స్ గ్రూప్ యూనిట్ 8200 చీఫ్ యాస్సి సారిల్ రాజీనామా చేశారు. హమాస్ చేసిన దాడులను అడ్డుకోవడంలో విఫలమైనందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సారిల్ వెల్లడించారు.
హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగారు. ఈ దాడుల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతిగా హమాస్‌కు కేంద్రంగా ఉన్న పాలస్తానాలోని గాజాపై గతేడాది నుంచి ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఇప్పటివరకు 41వేల118 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాడుల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది.
ఇదీ చదవండి.. మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
Comments
Please login to add a commentAdd a comment