వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అరుదైన ప్రసంగం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి వైట్ హౌస్ వేదికగా జాతినుద్దేశిస్తూ..ట్రంప్‌పై జరిగిన దాడిపై వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు జోబైడెన్ తెలిపారు.
సోమవారం తొలిసారి మిల్వాకీలోని రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ వేదికగా ప్రసంగం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దేశం మొత్తం తన ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మురం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై దాడి గురించి స్పందించారు.
👉ట్రంప్‌పై జరిగిన దాడిపై మాట్లాడిన జోబైడెన్..అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ హింసను ఉపేక్షించబోమని, ప్రోత్సహించమని హెచ్చరించారు.
👉ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనమందరం ఇప్పుడు పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నాం.ఎంత బలంగా ఉన్నా, హింసకు దిగకూడదు.
👉మేము చర్చించుకుంటాము, విభేదిస్తాము,ఒకరితో ఒకరం పోల్చి చూస్తాము. వ్యతిరేకంగా మాట్లాడుకుంటాం. అమెరికాలో మేం మా విభేదాలను బ్యాలెట్ బాక్స్ వద్ద పరిష్కరిస్తాము అని బైడెన్ తన ప్రసంగంలో చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment