![More Than 100 Cases Of Monkeypox In Europe - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/20/monkeyfox.jpg.webp?itok=xZ9xLWHy)
Monkeypox, a viral infection more common to west and central Africa: ఆఫ్రికాలో సర్వసాధారణమైన మంకీపాక్స్ యూరవప్‌ని వణికిస్తోంది. ఈ మంకీపాక్స్‌కి సంబంధించిన కేసలు యూరప్‌లో 100కు పైగా నమోదయ్యాయి. అంతేగాదు యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో సహా దేశాల్లో వీటికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఐతే శాస్ర్తవేత్తలు మాత్రం కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌కి సంబంధించిన కేసులు అంతంగా వ్యాప్తి చెందలేదు కాబట్టి ఇది అంతగా వ్యాప్తి చెందదని చెబుతున్నారు. మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరల్ అనారోగ్యం. ఇది జ్వరం వంటి లక్షణాలతో శరీరంపై దద్దర్లు కూడిన పొక్కుల వస్తుంటాయి. ఈ వ్యాదిని తొలిసారిగా కోతుల్లో గుర్తించారు. అంతే కాదు ఈ మంకీ పాక్స్ ఆఫ్రికావాసుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇప్పటికి వరకు ఈ కేసులు యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ మరియు పోర్చుగల్‌లలో ఈ కేసులను గుర్తించారు గానీ యూరప్‌లో ఇప్పటి వరకు గుర్తించని ఈ మంకీ పాక్స్‌కి సంబంధించిన కేసులు ఇప్పుడు అత్యధికంగా నమోదవుతున్నాయని జర్మని సాయుధ దళాల వైద్యా బృందం తెలపింది. ఐతే ఇది అంటువ్యాధి అని ఎక్కువకాలం కొనసాగే అవకాశం కూడా చాలా తక్కువ అని చెబుతోంది. దీనికి నిర్ధిష్టమైన వ్యాక్సిన్ మాత్రం లేదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మాత్రం మశూచిని నిర్మూలించడానికి ఉపయోగించే వ్యాక్సిన్ కోతులకు వ్యతిరేకంగా 85% వరకు ప్రభావవంతంగా ఉందని తెలిపింది. మంకీపాక్స్ బారిన పడిన కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతరులకు మశూచి వ్యాక్సిన్‌ను అందించినట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు.
(చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని)
Comments
Please login to add a commentAdd a comment