
న్యూఢిల్లీ : నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందన్న మీడియా వార్తల్ని నేపాల్ ఖండించింది. నేపాల్ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఓ సర్వే విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా.. చైనా అక్రమంగా సరిహాద్దు జిల్లాలలోని నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దీనిపై నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. నేపాల్ వ్యవసాయ శాఖ, లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు న్యూస్ ఏజెన్సీ ఆరోపణలు చేస్తోందని, వాస్తవానికి అటువంటి నివేదిక ఏదీ లేదని తెలిపింది. గతంలో ఈ విషయంపై వివరణ ఇచ్చామని పేర్కొంది. (నేపాల్ సంస్థతో ఫ్లిప్‌కార్ట్ జోడీ..)
ఇరు దేశాల మధ్య ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా స్నేహ పూర్వకంగా వాటిని పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని మీడియా సంస్థలను కోరింది. తప్పుడు ఆరోపణల ద్వారా రెండు దేశాల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సరిహద్దుల ఒప్పందం అక్టోబర్ 5 ,1961కి చైనా కట్టుబడి ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment