North Korea Kim Jong Slimmer Looks In Latest Photos, Triggers Speculations About Kim Jong Health - Sakshi
Sakshi News home page

Kim Jong-un: సన్నబడ్డ కిమ్​.. బాడీ డబుల్​ అనుమానాలు?

Published Thu, Jun 10 2021 11:38 AM | Last Updated on Thu, Jun 10 2021 12:47 PM

North Korea Slim Kim Jong Un Or Kim Double Body  - Sakshi

సియోల్​: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యం గురించి కిందటి ఏడాది రకరకాల పుకార్లు వినిపించాయి. ఒకానొక టైంలో కిమ్​ చనిపోయాడనే వార్తలు.. ప్రపంచానికి ఎంతో ఆసక్తిని కలిగించాయి. అయితే వారం తిరగకముందే మీడియా ముందు ప్రత్యక్షమై తాను నిక్షేపంగా ఉన్నానని శత్రు దేశాల గట్టి సందేశం పంపాడు కిమ్. ఇక కిమ్​ సన్నబడ్డాడనే తాజా వార్త.. అతని ఆరోగ్య స్థితిపై పలు సందేహాలకు తావిస్తోంది. చాలా కాలం తర్వాత సోమవారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్ బయటకు వచ్చాడు. కీలకమైన ఆర్థిక సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతో హాజరయ్యాడు.

ఆ భేటీ ఫొటోలు దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా బయటకు పొక్కాయి. అయితే అందులో కిమ్ రూపం చాలా మారిపోయి ఉంది. ముఖం, మెడ, చేతులు, ఛాతీ భాగం సన్నబడిపోయి.. కొంచెం మార్పు కనిపిస్తోంది. దీంతో ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకే కిమ్​.. సర్జరీ చేయించుకున్నాడని, అందుకే ఇన్నాళ్లు బయటకు రాలేదని సియోల్ స్పై ఏజెన్సీలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఇక కిమ్​ చేతికి ఉన్న 12 వేల డాలర్ల విలువ చేసే స్విస్​ వాచ్​ అందులో ఉంది కిమ్​ అనే నిర్ధారిస్తున్నాయని సియోల్ మీడియా హౌజ్​లు ప్రముఖంగా ప్రచురించాయి. పోయినేడాది జులైలో ఓ మీటింగ్​కు అటెండ్​ అయిన కిమ్ అదే వాచ్​ ధరించాడు. ఇప్పుడు అదే వాచ్​తో మరోసారి కనిపించాడు. అందుకే అది ముమ్మాటికీ కిమ్​ అనేది సియోల్ పత్రికల కథనం. 

బాడీ డబుల్ అనుమానాలు!
అయితే సియోల్​ కే చెందిన కవూహపన్​ అనే దినపత్రిక మాత్రం ఆసక్తికరంగా ఒక కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో కిమ్​ అధికారంలోకి వచ్చే నాటికి 90 కేజీల బరువు ఉన్నాడు. ఆ తర్వాత 2019 నాటికి మరో 50 కేజీల దాకా పెరిగాడు. కిమ్​ ఫ్యామిలీలో స్థూలకాయం సమస్య వారసత్వంగా వస్తోంది. ఆ కుటుంబంలో చాలామంది గుండెపోటుతో చనిపోయారు. పైగా కిమ్​ విలాసాలకు అలవాటుపడ్డ మనిషి. హెల్త్​ కేర్ పట్టించుకోడు. చైన్​ స్మోకింగ్​, విపరీతంగా మాంసాన్ని తింటాడు. వీటికి తోడు కిందటి ఏడాది  నుంచి కిమ్​ లేకుండానే పవర్ఫుల్​ పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్​లు నిర్వహించుకుంటోంది. భార్య, ముగ్గురు పిల్లలకు(చిన్నవాళ్లే) దూరంగా 38 ఏళ్ల కిమ్​ ఒంటరిగా ఉంటున్నాడనే కథనాలు వెలువడ్డాయి.

ఈ అనుమానాల నడుమ కిమ్ సడన్​గా ప్రత్యక్షం కావడం, సన్నబడ్డ లుక్​తో దర్శనమివ్వడంలో​ బాడీ డబుల్​(అలాంటి రూపురేఖలున్న మరో మనిషి)కి ఆస్కారం లేకపోలేదని కథనం ప్రచురించింది. కిందటి ఏడాది కిమ్​ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వచ్చాక.. మిలిటరీ సమావేశానికి హాజరైన కిమ్​ రూపంపై అమెరికా నిఘా ఏజెన్సీకి బోలెడు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాడీ డబుల్ పెద్ద కష్టమేమీ కాదన్నది  కవూహపన్​ కథనంతో ఆసక్తి నెలకొంది.

చదవండి: నార్త్​ కొరియాలో ఆకలి కేకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement