Pak PM Imran Khan Sensational Comments About His Govt Development Failure In Pakistan - Sakshi
Sakshi News home page

Imran Khan: పాక్​ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. ‘అంతర్జాతీయ బిచ్చగాడు’ అంటూ.. వాళ్లు! ఏ క్షణంలోనైనా భారీ షాక్ తగిలే ఛాన్స్​!

Published Sat, Feb 12 2022 10:01 AM | Last Updated on Sat, Feb 12 2022 11:24 AM

Pak PM Imran Khan Admits Failure Ready For No Confidence Motion - Sakshi

ఇమ్రాన్​ ఖాన్​ పాలనలో పాక్​ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులన్నీంటిని అమ్మేసుకుని.. అగ్గువకు ప్రైవేట్​ వనరులను ఆశ్రయిస్తోంది అక్కడి ప్రభుత్వం. చివరకు.. అగ్రదేశాల నుంచి అప్పులు కూడా పుట్టని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

పాక్​ను అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించాడు.  ప్రభుత్వానికి, దేశ ప్రయోజనాలకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్నాడు ఇమ్రాన్​ ఖాన్​. ‘‘అధికారంలోకి రావడానికి ముందు దేశంలో మార్పు తీసుకొస్తామని వాగ్దానం చేశా. కానీ, చెప్పినట్లు ‘మార్పు’ తీసుకురాలేకపోయాం. దీనికి దేశ ప్రజలు క్షమించాలి. అందుకు కారణం వ్యవస్థలోని లోపాలే. పుంజుకునేందుకు ప్రయత్నిస్తాం’’ అంటూ ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యలను డాన్​ న్యూస్​పేపర్​ యధాతధంగా ప్రచురించింది.



అధికారంలోకి రాగానే..  మేము విప్లవాత్మక చర్యల ద్వారా వెంటనే మార్పు తేవాలనుకున్నాం. కానీ, మా వ్యవస్థ అప్పటికే దిగజారిన వ్యవస్థను సంగ్రహించలేకపోయింది. ప్రభుత్వం.. అందులోని మంత్రులం ఎవరం లక్ష్యాన్ని సాధించలేకపోయాం అని ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, దేశ ప్రయోజనాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య అని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్​ ఖాన్​. 

ఎగుమతులు, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం.. ఈ మూడు విషయాలపైనే దృష్టిసారించినప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఇలాంటి పరిస్థితిని తామూ ముందుగానే ఊహించానని, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్​ ఖాన్​.

మిత్రపక్షాలు సైతం..

ఇదిలా ఉండగా.. పాక్​ స్థితిని దిగజార్చిన ఇమ్రాన్​ ఖాన్​ సర్కార్​ను గద్దె దించే ప్రయత్నాలు మొదలయ్యాయి. చేతకానీ దద్దమ్మ, అంతర్జాతీయ బిచ్చగాడు అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు Imran Khanను ఏకీపడేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఇమ్రాన్​ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని  ఏ క్షణంలోనైనా నేషనల్ అసెంబ్లీలో(పాక్​ పార్లమెంట్​) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పాకిస్థాన్​ డెమోక్రటిక్​ మూమెంట్​ పార్టీ పాక్​ పార్లమెంట్​లో అధికార పాకిస్థాన్ తెహ్రీక్​ ఇ ఇన్​సఫ్​ పార్టీకి వ్యతిరేకంగా​ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక గీస్తోంది. ఒకవైపు నిరసన ప్రదర్శనలతో పాటు  ఒకేసారి నేషనల్​ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఝలక్​ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం పీపీపీ, పీఎంఎల్​ ఎన్​తో పాటు ఇమ్రాన్​ జట్టు పార్టీలైన ఎంక్యూఎం, పీఎంఎల్​ క్యూ సైతం ముందుకొస్తున్నాయి. మరోవైపు అధికార పక్షాన్ని వీడేందుకు పలువురు నేతలు సైతం సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ప్రతిపక్షాలకు తన మిత్ర పక్షాలు, సొంత పీటీఐ పార్టీ నేతలు తోడు కావడంతో ఇమ్రాన్​ ఖాన్​ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

చదవండి: వాడుకొని వదిలేయడం ఆ దేశానికి అలవాటే: పాక్​ పీఎం కామెంట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement