వియన్నా : ప్రధాని మోదీకి ఆస్ట్రియాలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోరోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ బుధవారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో భారతీయులు, ఆస్ట్రియన్స్ కళాకారులు వందేమాతరం గీతంతో మోదీకి ఘనంగా స్వాగతం పలికారు.
Landed in Vienna. This visit to Austria is a special one. Our nations are connected by shared values and a commitment to a better planet. Looking forward to the various programmes in Austria including talks with Chancellor @karlnehammer, interactions with the Indian community and… pic.twitter.com/PJaeOWVOm1
— Narendra Modi (@narendramodi) July 9, 2024
41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1983లో ఆ దేశాన్ని సందర్శించిన చివరి ప్రధాని ఇందిరా గాంధీ.
ఇక మోదీ తన పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో కలిసి ఆస్ట్రియా, భారత్‌కు చెందిన వ్యాపార వేత్తలతో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.దీంతో పాటు ఆస్ట్రియాతో పలు ఒప్పందాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీ పర్యటనపై స్పందించిన నెహమ్మర్
ఇక మోదీ పర్యటనపై ఆస్ట్రియా ఛాన్సలర్ నెహమ్మర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 41ఏళ్లలో తొలిసారి భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. భారత్‌తో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు సందర్భంగా మనం వేడుక జరుపుకుంటున్నాం’ అని నెహమ్మర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో ఆస్ట్రియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్‌తో భేటీ అవుతారని, చాన్స్‌లర్‌తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఇఎఎం) వెల్లడించింది.
‘మా ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడం, అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై సన్నిహిత సహకారం గురించి మాట్లాడటానికి మాకు ఇదొక గొప్ప అవకాశం’అని ఆస్ట్రియన్ ఛాన్సలర్ నెహమ్మర్ అన్నారు.
ధన్యవాదాలు నెహమ్మర్
నెహమ్మర్ ట్వీట్‌పై మోదీ స్పందించారు. ‘ధన్యవాదాలు, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఆస్ట్రియాను సందర్శించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మన దేశాల మధ్య బంధాలను బలోపేతం చేయడం, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు నేను ఎదురుచూస్తున్నాను’అని మోదీ రిప్లయి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment