నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని.. | On Sleeping Woman Thinking Dead Man Calls Airport Security | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని..

Mar 13 2021 4:07 PM | Updated on Mar 13 2021 4:52 PM

On Sleeping Woman Thinking Dead Man Calls Airport Security - Sakshi

కొంతమంది జనం చుట్టూ చేరారు. నా కేమైందో అని ఆదుర్ధుగా చూస్తున్నారు. సెక్కూరిటీ వాళ్లు..

ఎయిర్‌ పోర్టు లాన్‌లో ప్రశాంతంగా నిద్రపోతున్న మహిళను చనిపోయిందని భావించి సెక్కూరిటీ సిబ్బందికి ఫోన్‌ చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె నిద్ర అక్కడి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. లారా అనే టిక్‌ టాక్‌ యూజర్‌ ఎయిర్‌ పోర్టు ట్రావెలింగ్‌కు సంబంధించిన తన అనుభవాలను వీడియోలు చేసి తన టిక్‌ టాక్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన ఓ అనుభవాన్నితాజాగా వీడియో తీసి పోస్ట్‌ చేశారామె. ఆ వీడియోలో.. ‘‘ఊబర్‌ లాంటి క్యాబ్‌ సర్వీసులు లేని సమయం అది. నేను తెల్లవారుజామున 4 గంటలకు లోకల్‌ బస్‌లో  ఎయిర్‌ పోర్టుకు వెళ్లాను. 5.30 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోకి చేరుకున్నాను. నా ఫ్లైట్‌ 7 గంటలకు ఉంది.

బాగా ఎక్కువ ఖాళీ సమయం ఉండే సరికి అక్కడే లాన్‌లో పడుకున్నాను. ఎక్కువ సేపు కదలకుండా పడుకునే సరికి.. నా పక్కనున్న వ్యక్తి నేను చనిపోయాననుకున్నాడు. వెంటనే సెక్కూరిటీని అక్కడికి పిలిచాడు. కొంతమంది జనం చుట్టూ చేరారు. నా కేమైందో అని ఆదుర్ధుగా చూస్తున్నారు. సెక్కూరిటీ వాళ్లు నన్ను తట్టి లేపారు. పైకి లేచాను. అక్కడి వాళ్లంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు’’ అని చెప్పుకొచ్చింది.

చదవండి : ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?!

పూనమ్‌ అందాల విందు.. అదిరిన కాజల్‌‌ పరువాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement