న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్‌లో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్‌లు ఓటమి చవిచూసి లేబర్ పార్టీ గద్దెనెక్కడంతో ఈ అధికార మారి్పడి ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది. దానికి భారత వ్యతిరేక, పాక్ అనుకూల పారీ్టగా పేరుండటమే ఇందుకు కారణం. 1997లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భారత పర్యటనకు వచ్చారు.
పాలక లేబర్ పార్టీ సలహా మేరకు ముందుగా పాకిస్తాన్‌లో ఆగడమే గాక, ‘ఇరు దేశాలూ కశీ్మర్‌పై విభేదాలను పరిష్కరించుకో’వాలని పాక్ గడ్డ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ బ్రిటన్ విదేశాంగ మంత్రి రాబిన్ కుక్ నోటి దురుసు ప్రదర్శించడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. దీనిపై భారత్ భగ్గుమనడమే గాక, బ్రిటన్‌ను థర్డ్ రేట్ దేశంగా నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ ఛీత్కరించుకునేదాకా వెళ్లింది.
ఉద్రిక్తతల నడుమ రాణి భారత పర్యటన మొక్కుబడిగా ముగిసింది. 2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ కశీ్మర్ సమస్యకు ఐరాస ఆధ్వర్యంలో రిఫరెండం నిర్వహించాలంటూ బ్రిటన్ పార్లమెంట్‌లో తీర్మానమే ప్రవేశపెట్టారు! దాంతో బ్రిటన్‌లో ప్రబల శక్తిగా ఉన్న భారతీయులు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పారీ్టకి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ఘోర ఓటమికి ఇది కూడా ముఖ్య కారణంగా నిలిచింది.
పైగా ఆ పార్టీ నేతల్లో ఖలిస్తానీ సానుభూతిపరుల సంఖ్య ఎక్కువ. సారథిగా స్టార్మర్ రాకతో చాలా సానుకూల మార్పు వచి్చందంటున్నారు. ఎన్నికల్లో బ్రిటిష్ ఇండియన్ల మద్దతు కోసం ఆయన పలు చర్యలు చేపట్టారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. పారీ్టలోని ఖలిస్తానీ అనుకూల నేతల ప్రాధాన్యాన్ని బాగా తగ్గించారు. ‘‘భారత్‌తో సన్నిహిత సంబంధాలే మా ప్రాథమ్యం. హిందూఫోబియాకు బ్రిటన్‌లో ఏ మాత్రమూ స్థానం లేదు. వాణిజ్యంలోనే గాక పర్యావరణ, భద్రత వంటి పలు రంగాల్లో భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పని చేస్తాం’’ అని ప్రధానిగా తొలి ప్రసంగంలో స్టార్మర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment