లాస్ ఏంజిల్స్/కాలిఫోర్నియా: మనలో చాలామందికి.. రోడ్డు మీద, వీధుల్లో అప్పుడప్పడు కొందరు తారసపడుతుంటారు. చార్జీకి డబ్బులు తక్కువ ఉన్నాయని.. లేదంటే.. పర్సు మర్చిపోయాను.. తింటానికో లేక ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేవు.. సాయం చేయమని వేడుకుంటుంటారు. మన దగ్గర ఉంటే సాయం చేస్తాం.. లేదంటే పక్కకు తప్పుకుంటాం. అయితే ఇలా అడిగే వారిలో చాలా మంది నకిలీలే ఉంటారు. అందుకే ఇలాంటి వారికి సాయం చేయాలంటే జనాలు ఆలోచిస్తారు.
కానీ పెద్దలు ఓ మాట చెప్పారు. సమస్యలో ఉన్నానని.. సాయం కోరితే.. తిరిగి వారి వద్ద నుంచి ఆశించకుండా మనం సాయం చేస్తే.. తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అని. ఈ మాటని నిజం చేసే సంఘటన ఒకటి లాస్ ఏంజిల్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రిస్ ఈవాన్స్ అనే ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!)
ఈ వీడియోలో ఓ మహిళ షాపింగ్ మాల్‌లో తనకు కావాల్సిన సరుకులు తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె దగ్గరకు ఓ అపరిచితుడు వచ్చి.. ‘‘నా వాలెట్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను.. బాగా ఆకలి వేస్తుంది.. ఈ పూట మీరు నాకు ఆహారం కొనివ్వగలరా’’ అని సదరు మహిళను ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక్కడితో అయిపోలేదు.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.
పర్స్ మర్చిపోయాను అని చెప్పిన వ్యక్తి సదరు మహిళకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కొన్న సరుకులకు అతడే బిల్ కడతానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ అపరిచిత వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ.. ‘‘మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు తీసుకున్న ఈ సరుకులన్ని మీకు ఉచితంగా ఇస్తున్నాను. మీకు కావాల్సిన సరుకులన్నింటిని మేమే కొని మీకు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా మంచివారు.. సాటి మనుషుల పట్ల జాలి, దయ కలిగి ఉన్నారు. నేను ఎవరో తెలియకపోయినా.. నేను చెప్పేది నిజమో.. అబద్ధమో కూడా ఆలోచించకుండా.. నా ఆకలి తీర్చడానికి అంగీకరించారు. మీ మంచి మనసుకు ఈ చిన్న బహుమతి’’ అన్నాడు.
(చదవండి: ఈ రాజభవనం అద్దె ఎంతంటే......)
తాను చేసిన పనికి ఇంత మంచి ఫలితం లభిస్తుందని ఊహించని సదరు మహిళ.. షాక్‌కు గురవుతుంది. అతడి మాటలు విని ఆనందంతో కన్నీరు పెడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ‘‘మంచి మనసు ఉన్న వారికి ఎప్పుడు మంచే జరగుతుంది’’.. ‘‘ఫలితం ఆశించకుండా ఎవరికైనా మేలు చేసస్తే.. మనకు కూడా మేలు జరుగుతుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
My allergies are acting up 😢 pic.twitter.com/3hoMuXg63o
— chris evans (@chris_notcapn) October 4, 2021
Comments
Please login to add a commentAdd a comment